22 June, 2026 | 2:22 AM

భారత్ యోగ భూమి

22-06-2026 01:01 AM
  1. కేంద్ర మంత్రి బండి సంజయ్ 
  2. కరీంగనగర్‌లో యోగా దినోత్సవం

కరీంనగర్, 21 (విజయక్రాంతి) : భారతదేశం యోగ భూమిగా ప్రపంచ దేశాలన్ని గుర్తింపు ఇచ్చాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవా న్ని పురస్కరించుకుని ఆదివారం కరీంనగర్‌లో నిర్వ హించిన యోగా వేడుకల్లో ఆయన ఆసనాలు వేశారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచానికి యోగాను అందించింది భారతీయ సంస్కృతి అని అన్నారు.

వేల సంవత్సరాల క్రితం మన రుషులు ప్రకృతితో మమేకమై జీవిస్తూ ఆరోగ్య రహస్యాలను కనుగొన్నారని, వారు మనకు అందించిన అమూల్యమైన కానుకే యోగా అని అన్నారు. ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యలైన ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్, జీవన శైలి వ్యాధులకు మం దుల కంటే ముందు యోగా ఒక సహజ పరిష్కారంగా నిలుస్తోందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయ కత్వంలో యోగా ప్రపంచవ్యాప్త ఉద్యమంగా మారిందన్నారు.

2014లో ఐక్యరాజ్యసమితి వేదికపై భారత ప్రధాని నరేంద్ర మోదీ యోగా దినోత్సవాన్ని ప్రకటించాలని ప్రతిపాదిస్తే కేవలం 90 రోజుల్లోనే 177 దేశాలు ఈ ప్రతిపాదనకు మద్దతు ఇవ్వడం ప్రపంచ చరిత్రలో ఒక విశేషమన్నారు. ఫలితంగా ఐక్యరాజ్యసమితి జూన్ 21ను అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించిందని, నేడు 190కు పైగా దేశాల్లో వందల కోట్ల మంది యోగా చేస్తున్నారని చెప్పా రు. కార్యక్రమంలో మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయ ర్ సునీల్ రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి క్రిష్ణారెడ్డి, పలువురు బీజేపీ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.