calender_icon.png 19 January, 2026 | 12:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిరీస్ చిక్కేదెవరికి?

18-01-2026 12:00:00 AM

చివరి వన్డేకు భారత్, కివీస్ రెడీ

ఇండోర్ వేదికగా సిరీస్ డిసైడర్

అర్షదీప్‌కు ఛాన్స్

బ్యాటింగ్‌లో టెన్షన్ లేకున్నా బౌలింగ్ వైఫల్యం వెంటాడుతున్న వేళ సిరీస్ ఫలితాన్ని తేల్చే మ్యాచ్‌కు భారత్ రెడీ అయింది. ఇండోర్ వేదికగా ఆదివారం చివరి వన్డే జరగనుండగా.. బౌలర్ల పేలవ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. తుది జట్టులో నితీశ్‌పై ఫోకస్ పెరగడంతో పాటు అర్షదీప్ సింగ్‌కు ఛాన్స్ ఇస్తారన్న అంచనాలున్నాయి. అదే సమయం లో రెండో వన్డే గెలిచి సిరీస్ సమం చేసిన న్యూజిలాండ్ ఫుల్ జోష్‌తో బరిలోకి దిగుతుండగా మ్యాచ్ హోరాహోరీగా సాగడం ఖాయం. 

ఇండోర్, జనవరి 17: భారత్, న్యూజిలాండ్ మధ్య రసవత్తరంగా సాగుతున్న వన్డే సిరీస్ ముగింపు దశకు చేరింది. తొలి వన్డేలో భార త్ గెలిస్తే.. రెండో వన్డేలో పుంజుకున్న న్యూ జిలాండ్ సిరీస్ సమం చేసింది. ఇప్పుడు ఇండోర్ వేదికగా ఇరు జట్లు సిరీస్ ఫలితాన్ని తేల్చే చివరి మ్యాచ్‌కు సిద్ధమయ్యా యి. తొలి వన్డేలో భారత్ గెలిచినప్పటకీ బౌలింగ్ మాత్రం అనుకున్న స్థాయిలో లేదు. నిజం చెప్పాలంటే అత్యంత పేలవంగా ఉంది. రెండో వన్డేలో ఈ బౌలింగ్ కారణంగానే ఓడిపోయింది. ఈ రెండు మ్యాచ్‌లలో భారత బౌలర్లు పూర్తి గా నిరాశపరిచారనే చెప్పాలి. సొంతగడ్డపై మన జట్టు నుంచి ఇలాంటి బౌలింగ్ కనిపించడం  అభిమానులకు తీవ్ర నిరాశ కలిగి స్తోంది.

ఈ తరహా బౌలింగ్‌తో విజయాలు ఆశించిన ఖచ్చితంగా అత్యాశే. ఎన్నో అంచనాలు పెట్టుకున్న సిరాజ్ తేలిపోతున్నాడు. హర్షిత్ రాణా, ప్రసిద్ధ కృష్ణ సైతం ప్రభావం చూపించలేకపో యారు. అటు స్పిన్నర్లు సైతం విఫలమవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. సిరీస్ ఫలితాన్ని డిసైడ్ చేయబోతున్న మూడో వన్డేలో బౌలర్లు దాడిన పడితే తప్ప విజయాన్ని అందుకోవడం కష్టమే. మరోవైపు బ్యా టింగ్‌లో గిల్ ఫామ్ అందుకున్నాడు. మరో ఓపెనర్ రోహిత్ మాత్రం సౌతాఫ్రికా సిరీస్ ఫామ్ కొనసాగించలేకపోతున్నాడు. అలాగే తొలి వన్డేలో సెంచరీ చేజార్చుకున్న విరాట్ కోహ్లీ మరోసారి అలాంటి ఇన్నింగ్స్ ఆడాలని ఎదురుచూస్తున్నారు.అటు కేఎల్ రాహుల్ సెంచరీతో ఫామ్‌లోకి రాగా, ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డి వైఫల్యాల బాట వీడలేదు.

నితీశ్ స్థానంలో ఆయుశ్ బదోనికి ప్లేస్ దక్కొచ్చు. అలాగే మరో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కూడా నిరాశ పరుస్తున్నాడు.  ప్రస్తుతం జడేజా రిటైర్మెంట్‌పైనా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే బౌలింగ్‌లో వరుసగా రెండు మ్యాచ్‌లలో ఫెయిలైన ప్రసిద్ధ కృష్మపై వేటు పడడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు తొలి వన్డేలో ఓడినప్పటకీ తర్వాత అద్భుతంగా పుంజుకున్న న్యూజిలాండ్ దెబ్బకు దెబ్బ తీసింది. రెండో వన్డేలో భారీ లక్ష్యాన్ని ఛేదించి సిరీస్‌ను సమం చేసింది. ఆరంభంలోనే 2 వికెట్లు పడినా విల్ యంగ్, డారిల్ మిఛెల్ అదరగొట్టారు. ముఖ్యంగా మిఛెల్ భారత బౌలర్లపై ఆధిఉపత్యం కనబరిచాడు. అతనికి తోడు మిగిలిన బ్యాటర్లు కూడా రాణిస్తే భారీస్కోరు ఖాయం. భారత బౌలర్లు కివీస్ బ్యాటర్లను ఏ మాత్రం ఇబ్బంది పెట్టలేకపోతున్నారు. దీంతో వాళ్లు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తున్నారు.

పిచ్ రిపోర్ట్

మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తున్న ఇండోర్ పిచ్‌పై పరుగుల వరద ఖాయం. ఇక్కడ ఎప్పుడూ బ్యాటింగ్‌కే పిచ్ అనుకూలంగా. ఇప్పుడు మంచు ప్రభావం కూడా ఉండనుండడంతో భారీస్కోర్లు నమోదయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ ఆడిన చివరి రెండు మ్యాచ్‌లలోనూ భారత్ 399, 385 పరుగులు చేసింది.

భారత తుది జట్టు (అంచనా) 

గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (కీపర్), నితీశ్ రెడ్డి/ ఆయుశ్ బదోని, జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాజవ్, ప్రసిధ్ధ కృష్ణ/అర్షదీప్ సింగ్, సిరాజ్

న్యూజిలాండ్ తుది జట్టు (అంచనా)

కాన్వే, నికోలస్, విల్ యంగ్ , డారిల్ మిచెల్ , మిఛెల్ హే(కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మిఛెల్ బ్రేస్‌వెల్(కెప్టెన్), క్రిస్టియన్ క్లార్క్, కైల్ జేమిసన్, జాక్ ఫౌల్క్స్, ఆదిత్య అశోక్/జేడెన్ లానెక్స్