19-01-2026 12:44:45 AM
హైదరాబాద్, జనవరి 18 : క్యాన్సర్‌పై అవగాహన పెంపొందించడం, ఆర్థికంగా వెనుకబడి చిన్నారుల క్యాన్సర్ చికిత్సకు అం డగా నిలిచే లక్ష్యంతో క్యూర్ ఫౌండేషన్, అపోలో క్యాన్సర్ సెంటర్ ఆధ్వర్యంలో క్యాన్సర్ క్రూసేడర్స్ గోల్ఫ్ చాంపియన్‌షిప్ నిర్వహిస్తోంది. 9వ ఎడిషన్ జనవరి 30 నుంచి ఫిబ్రవరి 1 వరకు గచ్చిబౌలీలోని బౌల్డర్ హిల్స్ గోల్ఫ్ కంట్రీ క్లబ్‌లో జరగనుంది. ఈ పోటీలను సినీనటుడు జగపతి బాబు, హీరోయిన్ సంయుక్త మీనన్, క్యూర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు పి విజయానంద్ రెడ్డి అధికారికంగా ప్రారంభించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో 450 మం దికి పైగా గోల్ఫర్లు, కార్పొరేట్ ప్రముఖులు, పలువురు సెలబ్రిటీలు పాల్గొంటున్నారు.
సామాజిక బాధ్యతగా వీరంతా నిధుల సేకరణకు తమవంతు మద్ధతు తెలుపుతున్నట్టు క్యూర్ ఫౌండేషన్ ఫౌండర్ విజయానంద్ రెడ్డి చెప్పారు. ఇది కేవలం క్రీడాపోటీగా మాత్రమే కాకుండా క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడే గొప్ప వేదికగా రూపుదిద్దుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు. కాగా ఇ లాంటి సామాజిక బాధ్యతతో కూడిన గొప్ప కార్యక్రమంలో తాము కూడా భాగం కావ డం సంతోషంగా ఉందని నటుడు జగపతిబాబు, హీరోయిన్ సంయుక్త మీనన్ చెప్పా రు. ఈ కార్యక్రమంలో అపర్ణా ఎంటర్‌ప్రైజెస్ డైరెక్టర్ అపర్ణారెడ్డి, ప్రైడ్ మోటార్స్ ఎండి ఎం సురేష్ రెడ్డి, ఎమ్మార్ ప్రాపర్టీస్ సీఎఫ్‌వో మధుసూదన్‌రావు, టీ గోల్ఫ్ అలియ న్స్ ప్రెసిడెంట్, సీఈవో ఎన్‌ఆర్‌ఎన్ రెడ్డి పాల్గొన్నారు.