ఇండియా కూటమిని గెలిపించాలి
సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అందోజు రవీంద్రచారి
ఎల్బీనగర్, ఏప్రిల్ 22 : లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమిని గెలిపించి, బీజేపీకి తగిన గుణపాఠం చెప్పా లని ఓటర్లకు సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అందోజు రవీంద్రచారి, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య పిలుపునిచ్చారు. సరూ ర్‌నగర్ మండల మహాసభ బండ్లగూడలోని నవచేతన భవనంలో బోయప ల్లి రాములు అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పదేండ్ల పాలనతో దేశం ఆదోగతికి చేరిందన్నారు.
దళితులు, మైనార్టీలపై దాడులు పెరిగాయని ఆరోపిం చారు. హైదరాబాద్‌లో పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సమావేశంలో సరూర్‌నగర్ మండల కమిటీని ఎన్నుకున్నారు. మండల కమిటీ కార్యదర్శిగా బాతరాజు నర్సింహ, సహాయ కార్యదర్శులు గా సుధాకర్, రాములు ఎన్నికయ్యారు. సమావేశంలో సీపీఐ హయత్‌నగర్ మండల కార్యదర్శి శేఖర్‌రెడ్డి, నాయకు లు ప్రవీణ్‌కుమార్, కృష్ణ, క్రాంతికుమార్, పార్వతమ్మ పాల్గొన్నారు.






