13 July, 2026 | 5:17 AM

ముంబై x కోల్‌కతా

03-05-2024 01:22 AM

ముంబై: ఐపీఎల్లో వరుస పరాజయాలతో సతమతమవుతోన్న ముంబై ఇండి యన్స్ సొంతగడ్డపై మరో మ్యాచ్‌కు సిద్ధమైంది. శుక్రవారం ముంబై వేదికగా అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తోన్న కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)తో పాండ్యా సేన అమీతుమీ తేల్చుకోనుంది. కేకేఆర్ ఆడిన 9 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు ముంబై ఆడిన 10 మ్యాచ్‌ల్లో మూడు విజయాలతో 9వ స్థానంలో ఉంది. ముంబైపై విజయం సాధించి ప్లేఆఫ్‌కు మరింత చేరువ కావాలని కోల్‌కతా భావిస్తుండగా.. సొంతగడ్డపై కోల్‌కతాను ఓడించి గెలుపు రుచి చూడాలని ముంబై అనుకుంటోంది.

ముంబై బ్యాటింగ్ లైనప్‌లో తిలక్ వర్మ, నెహాల్ వదేరా, టిమ్ డేవిడ్ మాత్రమే నిలకడగా రాణిస్తున్నారు. రోహిత్, ఇషాన్, సూర్యల ఫామ్ జట్టును కలవరపెడుతోంది. కెప్టెన్ పాండ్యా పూర్తిగా విఫలమవుతున్నాడు. బుమ్రా, కోట్జీలతో బౌలింగ్ విభాగం కాస్త పర్వాలేదనిపిస్తోంది. ఇక కోల్‌కతా విషయానికి వస్తే ఓపెనర్లు సాల్ట్, నరైన్‌లు జట్టుకు అదిరిపోయే ఆరంభాలు ఇస్తున్నారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, రసెల్, రింకూ సింగ్,  వెంకటేశ్ అయ్యర్‌లతో బ్యాటింగ్ విభాగం పటిష్టంగా కనిపిస్తోంది. బౌలింగ్‌లో వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరాలు తమ నైపుణ్యంతో ప్రత్యర్థులను ముప్పతిప్పలు పెడుతున్నారు.