15 April, 2026 | 12:54 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

జూన్ 14న భారత్, పాక్ మ్యాచ్

25-02-2026 12:00 AM

మహిళల టీ20 వరల్డ్‌కప్ షెడ్యూల్ విడుదల

దుబాయి, ఫిబ్రవరి 24 : ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేసింది. జూన్ 12 నుంచి ఈ మెగా టోర్నీ మొదలు కానుంది. జూలై 14న చిరకాల ప్రత్యర్థులు భారత్. పాకిస్థాన్ మధ్య ఎడ్జ్‌బాస్టన్‌లో మ్యాచ్ జరగనుం ది. ఈ మెగా ఈవెంట్‌లో మొత్తం 12 జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి.  చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ ఒకే గ్రూప్‌లో ఉండగా.. తొలిసారి మెగా టోర్నీకి అర్హత సాధించిన నెదర్లాండ్స్ సైతం ఇదే గ్రూప్‌లో  చోటు దక్కించుకుంది.

గ్రూప్ దశలో ప్రతి జట్టు ఐదు మ్యాచ్‌లు ఆడుతుంది. రెండు గ్రూపుల నుండి అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు నేరుగా సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. గ్రూప్ ఏలో భారత్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా వంటి మేటి జట్లతో పాటు బంగ్లాదేశ్, నెదర్లాండ్స్‌కు చోటు దక్కింది. గ్రూప్ బీ లో మాజీ ఛాంపియన్లు న్యూజిలాండ్, వెస్టిండీస్, ఇంగ్లండ్,శ్రీలంక,  స్కాట్లాండ్, ఐర్లాండ్ ఉన్నాయి.

మొత్తంగా ఏడు వేదికల్లో 33 మ్యాచ్ లు నిర్వహిస్తారు. ఓల్డ్ ట్రాఫోర్డ్, హెడింగ్లే, హ్యాంప్షైర్ బౌల్, బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్, ఎడ్జ్‌బాస్టన్, ది ఓవల్‌లో లీగ్ దశ, సెమీస్ మ్యాచ్ లు ఉంటాయి. టోర్నీ నాకౌట్ దశ జూన్ 30 నుంచి ప్రారంభమవుతుంది. మొదటి సెమీఫైనల్ జూన్ 30న, రెండో సెమీఫైనల్ జులై 2న ప్రఖ్యాత ’ది ఓవల్’ మైదానంలో నిర్వహిస్తారు. ఇక ప్రపంచ విజేత ఎవరో తేల్చే గ్రాండ్ ఫైనల్ మ్యాచ్ జూలై 5న చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో జరుగుతుంది.

గ్రూప్ 1: భారత్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్

గ్రూప్ 2: న్యూజిలాండ్, వెస్టిండీస్, ఇంగ్లండ్, శ్రీలంక, స్కాట్లాండ్, ఐర్లాండ్