17 April, 2026 | 2:42 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

ఆసీస్ మహిళలదే తొలి వన్డే

25-02-2026 12:00 AM

తేలిపోయిన భారత బ్యాటర్లు

బ్రిస్బేన్, ఫిబ్రవరి 24 : ఆసీస్‌పై టీ20 సిరీస్ గెలిచిన భారత మహిళల జట్టు వన్డే సిరీస్‌ను ఓటమితో ఆరంభించింది. బ్రిస్బేన్ వేదిక గా జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా మహిళల జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.  తొలుత బ్యాటింగ్ చేసిన హర్మన్ సేన 48.3 ఓవర్లలో 214 పరుగులకే ఆలౌటైంది. భారత్‌కు సరైన ఆరంభం లభించలేదు. స్టార్ బ్యాటర్లు ప్రతిక రావల్ (0), షెఫాలీ వర్మ(4) నిరాశపరిచారు.

అయితే స్మృతి మంధాన (58), కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (53)హాఫ్ సెంచరీలతో జట్టును ఆదుకున్నారు. ఆ తర్వాత భారత్ వరుసగా వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. చివర్లో కశ్వీ గౌతమ్ (43) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో భారత్ 200 పరుగుల మార్కును దాటగలిగింది.

ఆస్ట్రేలియా బౌలర్లలో యాష్ గార్డనర్ 3 వికెట్లతో రాణించింది. తర్వాత 215 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. 38.2 ఓవర్లలో కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. ఓపెనర్లు అలిస్సా హీలీ (50), ఫోబ్ లిచ్ఫీల్ (32) మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు.  బెత్ మూనీ (76 నాటౌట్) మెరుపు బ్యాటింగ్‌తో జట్టును గెలుపు తీరాలకు చేర్చింది.