24-11-2025 12:00:00 AM
కొలంబో, నవంబర్ 23 : భారత అంధు ల మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారిగా నిర్వహించిన టీ ట్వంటీ ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. కొలంబో వేది కగా జరిగిన ఫైనల్లో నేపాల్‌పై 7 వికెట్ల తేడా తో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన నేపాల్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 114 పరుగులు చేసింది.భారత మహిళల జట్టు అద్భుతంగా బౌలింగ్ చేసి నేపాల్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేసింది.
ఇన్నిం గ్స్ మొత్తం మీద భారత్ ఒకే ఒక బౌండరీ ఇచ్చింది. ఛేజింగ్‌లో భారత మహిళల జట్టు ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఆడుతూ పాడు తూ లక్ష్యాన్ని అందుకున్నారు. ఓపెనర్ పులా సురెన్ 44 , తెలుగుమ్మాయి కరుణ్ కుమారి 42 పరుగులతో రాణించారు. తొలిసారి ని ర్వహించిన ఈ టోర్నీలో భారత్, నేపాల్ జట్లతో పాటు శ్రీలంక, యూఏఈ. పాకిస్తాన్ ఆస్ట్రేలియా పాల్గొన్నాయి.
ఈ టోర్నీ ఆరం భం నుంచీ భారత మహిళల జట్టు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. శ్రీలంకపై 10 వికె ట్ల తేడాతో, ఆస్ట్రేలియాపై 209 పరుగుల తేడాతో, నేపాల్‌పై 85 రన్స్ తేడాతో, అమెరికాపై 10 వితెట్ల తేడాతో, పాకిస్తాన్‌పై 8 వికె ట్ల తేడాతో విజయాలు అందుకుంది. సెమీస్‌లో ఆసీస్‌ను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసిం ది. భారత అంధుల మహిళల జట్టుకు పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు.