calender_icon.png 24 November, 2025 | 2:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్మృతి పెళ్లి వాయిదా

24-11-2025 12:00:00 AM

తండ్రి అనారోగ్యమే కారణం

సాంగ్లి, నవంబర్ 23 : భారత మహిళల జట్టు స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన ఇంట్లో ఊహించని ఘటన చోటు చేసుకుంది. స్మృ తి మంధాన వివాహం వాయిదా పడింది. ఆమె తండ్రి శ్రీనివాస్ మంధాన అనారోగ్యానికి గురవడమే దీనికి కారణం. ముందు గా నిర్ణయించిన తేదీ ప్రకారం ఆదివారం స్మృతి మంధాన, పలాశ్ ముచ్చల్ వివాహం జరగాల్సి ఉంది. దీనికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

శనివారం రాత్రి సంగీత్ కార్యక్ర మం కూడా ఉత్సాహంగా జరిగింది. స్మృతి, ముచ్చల్ కుటుంబసభ్యులతో పాటు పలువురు భారత మహిళా క్రికెటర్లు కూడా ఈ వేడుకలకు హాజరయ్యారు. అయితే ఆదివా రం ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత స్మృతి మంధాన తండ్రికి గుండెపోటు వచ్చింది. దీంతో ఆయనను హుటాహుటిన సాంగ్లిలో ని హాస్పిటల్‌కు తరలించారు.

ప్రస్తుతం ఆయనకు ఐసీయూ లో చికిత్స అందిస్తున్నా రు. తండ్రికి గుండెపోటు రావడంతో స్మృతి వివాహం నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు ఆమె మేనేజర్ వెల్లడించారు. 2019 నుంచి స్నేహితులుగా ఉన్న పలాశ్, స్మృతి  ఇటీవలే తమ లవ్ రిలేషన్‌ను వెల్లడించారు.