calender_icon.png 24 November, 2025 | 2:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లక్ష్యసేన్‌దే ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్

24-11-2025 12:00:00 AM

సిడ్నీ, నవంబర్ 23 : భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ ఎట్టకేలకు ఈ సీజన్‌లో తొలి టైటి ల్ అందుకున్నాడు. హాంకాంగ్ ఓపెన్ ఫైనల్ చేరినా రన్నరప్‌తో సరిపెట్టుకున్న ఈ యువ షట్లర్ తాజాగా ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను కైవసం చే సుకున్నాడు. ఫైనల్లో జపాన్‌కు చెందిన యుషి టనకపై 21 21 స్కోర్‌తో విజయం సాధించాడు. ఈ ఏడాదిలో లక్ష్యసేన్‌కు ఇదే తొలి టైటిల్.

అతను గత ఏడాది చివరిగా సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ టైటిల్ గెలిచాడు. ఈ సీజన్‌లో తొలి టైటిల్ అందుకోవడంపై సంతోషం వ్యక్తం చేసిన లక్ష్యసేన్ ఫిట్‌నెస్‌తో పాటు గేమ్‌ను మెరుగుపరుచుకోవడంపై దృష్టి పెట్టడం ఫలి తాన్ని చ్చిందని చెప్పాడు. కాగా ఈ టోర్నీ సెమీస్ అతనికి గట్టిపోటీనిచ్చిన మ్యాచ్‌గా నిలిచింది. ఈ విజ యంతో ఫామ్ అందుకున్న లక్ష్యసేన్ ర్యాం కింగ్స్‌లో టాప్ చేరడమే తర్వాతి టార్గెట్‌గా పెట్టుకున్నాడు.