calender_icon.png 16 May, 2025 | 12:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మండలంలో కనిపించని పల్లె వెలుగు బస్సులు

15-05-2025 06:31:01 PM

ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాతకోట్ల నాగరాజు..

మునగాల: మండల పరిధిలోని కలకోవ, జగన్నాధపురం గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలని ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాతకోట్ల నాగరాజు(MRPS District General Secretary Patakotla Nagaraju) పత్రిక ప్రకటన ద్వారా గురువారం మండల కేంద్రంలో తెలియజేశారు. ఈ సందర్భంగా పాతకోట్ల నాగరాజు మాట్లాడుతూ... రెండు గ్రామాలను కలుపుతూ బస్సు సౌకర్యం కల్పించాలని జగన్నాధపురం, కలకోవ గ్రామాల రైతులు, వృద్ధులు, వికలాంగులు, విద్యార్థినీ విద్యార్థులు, వ్యాపారస్తులు, చాలా తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారని, జూన్ నెలలో కాలేజీలు, స్కూల్స్ ఉన్నందున తక్షణమే స్పందించి గతంలో స్థానిక ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతిరెడ్డి(MLA Uttam Padmavathi Reddy)కి విన్నవించడం జరిగిందని, ఈ రెండు గ్రామాలను కలుపుతూ, బస్సు సౌకర్యం కల్పించాలని, కోదాడ ఆర్టీసీ డిపో మేనేజర్ స్పందించి, తక్షణమే కలకోవ, జగన్నాధపురం, గ్రామాలకు ఆర్టీసీ సౌకర్యం కల్పించాలి అన్నారు.