calender_icon.png 16 May, 2025 | 12:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రయాణికులకు షాక్.. మెట్రో ఛార్జీలు పెంపు

15-05-2025 05:44:39 PM

హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో(Hyderabad Metro) ప్రయాణికులకు షాకిచ్చింది. మెట్రో రైల్ టికెట్ల ధరలను పెంచుతున్నట్లు ఎల్ అండ్ టి సంస్థ(L&T Company) ప్రకటించింది. పెంచిన ధరలు ఈనెల 17 నుంచే అమలులోకి రానునట్లు హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ తెలిపింది. కనీష్ట ఛార్జీ రూ.10 నుంచి రూ.12కి, గరిష్ఠ ఛార్జీ రూ.60 నుంచి 75కి పెంచుతున్నట్లు ఎల్ అండ్ టి సంస్థ ప్రకటించింది. 

పెరిగిన ఛార్జీల వివరాలు ఇలా ఉన్నాయి..

మొదటి రెండు స్టాప్లకు 12 రూపాయలు..

2 నుంచి 4 స్టాప్ల వరకు 18 రూపాయలు..

4 నుంచి 6 స్టాప్ల వరకు 30 రూపాయలు..

6 నుంచి 9 స్టాప్ల వరకు 40 రూపాయలు..

9 నుంచి 12 స్టాప్ల వరకు 50 రూపాయలు..

12 నుంచి 15 స్టాప్ల వరకు 55 రూపాయలు..

15 నుంచి 18 స్టాప్ల వరకు 60 రూపాయలు..

18 నుంచి 21 స్టాప్ల వరకు  66 రూపాయలు..

21 నుంచి 24 స్టాప్ల వరకు  70 రూపాయలు..

24 స్టాప్లు నుంచి ఆపైన 75 రూపాయలు పెంచుతూ హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ నిర్ణయం తీసుకుంది.