calender_icon.png 15 May, 2025 | 11:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బోధన సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి

15-05-2025 05:55:18 PM

నిర్మల్ (విజయక్రాంతి): ఉపాధ్యాయులు బోధన సామర్థ్యాన్ని పెంపొందించుకొని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మంచి విద్యను అందించాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్(District Additional Collector Faizan Ahmed) అన్నారు. గురువారం నిర్మల్ పట్టణంలో నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ శిక్షణ తరగతులు ఉపాధ్యాయుల నైపుణ్యాలను మెరుగుపరుస్తాయని, కావున అందరూ హాజరు అయి శిక్షణను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

శిక్షణలో ఇప్పటివరకు ఏమేమి నేర్చుకున్నారు అని ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. అలాగే డి ఆర్ పి లు చెప్పిన బోధన మెళకువలు, డిజిటల్ బోధన పద్ధతులు, అభ్యసన ఫలితాల సాధన, జీవన నైపుణ్యాల పెంపు, కృత్యాధార బోధన మొదలగు అంశాలు ఇవ్వబడిన షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని, వాటిని ఉపాధ్యాయులు అవగాహన చేసుకోవాలని ఆయన తెలిపారు. ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఏఓ రమణారెడ్డి, ఏఎంఓ నర్సయ్య, కోర్స్ ఇంఛార్జీలు, డి ఆర్ పి లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.