10-05-2025 12:00:00 AM
చేవెళ్ల, మే 09: మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని చిలుకూరు యూకో బ్యాంక్ మేనేజర్గా గత మూడేళ్లుగా సేవలందించిన ఉదయ బాబు కుమార్కు బెంగూళూరుకు బదిలీ అయ్యింది. శుక్రవారం స్థానిక నేతలు, గ్రామస్తులు, బ్యాంకు సిబ్బంది ఆయనను శాలువాలతో సన్మానించి ఘనంగా వీడ్కోలు పలికారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సంగేరి మల్లేష్ మాట్లాడుతూ.. ఉదయ బాబు కుమార్ ప్రజలకు నిస్వార్థంగా సేవలందించారని కొనియాడారు. ఆయన బదిలీ గ్రామస్తులు, రైతులకు బాధ కలిగించినప్పటికీ, ఉద్యోగ బదిలీలు సర్వసాధారణమని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ ఆండ్రు, మాజీ ఎంపీటీసీ సహదేవ్ గౌడ్, గౌడ సంఘం అధ్యక్షుడు సుభాష్ గౌడ్, గోల్ అప్రైజర్ జ్ఞానేశ్వర్ చారి, క్యాషియర్ స్వప్న, అసిస్టెంట్ మేనేజర్ కావ్య, భావన తదితర బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.