15-05-2025 06:10:52 PM
జయశంకర్ భూపాలపల్లి (విజయక్రాంతి): కాళేశ్వరంలో సరస్వతీ పుష్కరాల(Saraswati Pushkaralu) సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా త్రివేణి సంగమం ఒడ్డున ఏర్పాటు చేసిన 17 అడుగుల సరస్వతీ మాత విగ్రహం, రెండు వైపుల చతుర్వేద మూర్తుల విగ్రహాలను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, దుద్ధిళ్ల శ్రీధర్ బాబు, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, పార్లమెంట్, శాసన మండలి, శాసన సభ్యులు పాల్గొన్నారు.