15-05-2025 04:59:00 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): ప్రభుత్వ విద్యాలయాల్లో 2025లో పదవ తరగతి పూర్తి చేసి 7.0/400 పైగా గ్రేడ్ మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ప్రభుత్వం ద్వారా అత్యుత్తమ జూనియర్ కళాశాలలో ప్రవేశాలు కల్పించనున్నట్లు మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) షెడ్యూల్ కులముల అభివృద్ధి అధికారి ఎం ఎల్.నరసింహ స్వామి తెలిపారు. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాలకు 1.50, పట్టణ ప్రాంతాలకు రెండు లక్షలకు మించి ఉండరాదన్నారు.
ఆసక్తిగల విద్యార్థులు ఈనెల 17 నుండి 31 వరకు ఈపాస్ వెబ్సైట్ https://telanganaepass.cgg.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. పదో తరగతి ఉత్తీర్ణత మెమో, మీ సేవ ద్వారా పొందిన కులము ఆదాయము, బ్యాంకు పాస్ బుక్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ప్రభుత్వ షెడ్యూల్ కులముల వసతి గృహము విద్యార్థులైతే మూడు సంవత్సరాల బోనఫైడ్ ధ్రువీకరణ పత్రంతో దరఖాస్తు సమర్పించాలని సూచించారు. దరఖాస్తు ప్రక్రియ ముగిసిన తర్వాత ఈపాస్ సిస్టం ఆటోమెటిక్ విధానం ద్వారా విద్యార్థుల ఎంపిక జరుగుతుందని చెప్పారు.