calender_icon.png 16 May, 2025 | 12:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పింగిళి కళాశాలలో హెల్త్ కేర్ మేనేజ్మెంట్, ఈ కామర్స్ ఆపరేషన్ కొత్త కోర్సుల ప్రారంభం

15-05-2025 06:41:07 PM

ప్రిన్సిపాల్ లెఫ్ట్ నెంట్ ప్రొఫెసర్ బి.చంద్రమౌళి..

హనుమకొండ (విజయక్రాంతి): పింగిలి ప్రభుత్వ మహిళా కళాశాల స్వయం ప్రతిపత్తిలో 2025-26 విద్యా సంవత్సరంలో రెండు నూతన డిగ్రీ కోర్సులను ప్రారంభిస్తామని కళాశాల ప్రిన్సిపల్ లెఫ్టినెంట్ ప్రొఫెసర్ బి చంద్రమౌళి(College Principal Lieutenant Professor Chandramouli) ఒక ప్రకటనలో తెలియజేశారు. అనంతరం ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. కళాశాలలో ఈ విద్య సంవత్సరమునకు ప్రస్తుత కాలానికి అనుగుణంగా డిగ్రీలో రెండు కొత్త కోర్సులు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కళాశాల విద్యా కమిషనర్ ఏఈ డిపి ఆధ్వర్యంలో బీఎస్సీలో హెల్త్ కేర్ మేనేజ్మెంట్ ఇంటర్మీడియట్ బైపిసి, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, డైరీ విద్యార్థులకు బికాంలో ఈ కామర్స్ ఆపరేషన్ కోర్సు ఇంటర్మీడియట్ కామర్స్, సైన్స్ చదివిన విద్యార్థులకు ఈ కోర్సులను, కళాశాల విద్యా కమిషనర్ హైదరాబాద్ వారు మంజూరు చేశారు.

ఇవి అప్రెంటిస్‌షిప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్‌లు (ఏఈడిపి) ఇవి 3 సంవత్సరాల డిగ్రీ ప్రోగ్రామ్‌లు, ఈ కోర్సులలో విద్యార్థులు రెండు సంవత్సరాల పాటు థీయరీ విద్యను, ఆ తర్వాత పూర్తి చివరి సంవత్సరం స్టైపెండియరీ అప్రెంటిస్‌షిప్‌ను అభ్యసిస్తారు. ఈ విధానం వారి అభ్యాస ప్రయాణాన్ని సుసంపన్నం చేస్తుంది. ఇంకా యజమానులు కోరుకునే స్పష్టమైన నైపుణ్యాలతో వారిని సన్నద్ధం చేస్తుంది. విద్యార్థులు కనీస స్టైపెండ్ అందుకునే అవకాశం కూడా ఉంటుంది. అట్లాగే కళాశాల విశిష్టతల గురించి మాట్లాడుతూ వడ్డేపల్లిలోని పింగిళి ప్రభుత్వ మహిళా కళాశాలకు అరవై ఏళ్ల ఘనచరిత్ర ఉందనీ ఈ కళాశాలలో చదివిన విద్యార్థులెందరో ఉన్నత రంగాలలో స్థిరపడ్డారు.

ప్రముఖ ఉద్యోగాల్లోనూ, విద్యా, వైద్య, శాస్త్ర, సాంకేతిక, రాజకీయ రంగాల్లోనూ అతిరథ మహారధులుగా ప్రజాసేవలో మమేకమై ఉన్నారనీ, పింగిళి కళాశాలకు జాతీయ స్థాయి న్యాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అటానమస్ హోదా, నాణ్యతా ప్రమాణాలు గర్తించే ఐఎస్ఓ గుర్తింపు ఉన్నదనీ కళాశాలలోని అధ్యాపకులకు నెట్, సెట్, ఎంఫిల్, పిహెచ్ డి లాంటి అత్యధిక విద్యార్హతలే కాకుండా దశాబ్దాల సుదీర్ఘ బోధనానుభవం ఉన్నది. సువిశాలమైన, సుందరమైన కళాశాల రెండంతస్తుల భవనం, అధునాతన సైన్స్ ల్యాబ్ లు, కంప్యూటర్ లాబ్ లు, అత్యాధునిక లైబ్రరీ, వర్చువల్, డిజిటల్,స్మార్ట్ తరగతి గదులు, విద్యార్థులకు ఆధునిక బోధన జరుగుతుంది. సివిల్స్, గ్రూప్స్, పోలీస్, ఆర్మీ,అగ్నివీర్, ఏయిర్ పోర్స్ బ్యాంకింగ్, ఇంకా అనేక రకాల పోటీ పరీక్షలకు కెరీర్ గైడెన్స్ సెల్, టిఎస్ కెసి, టాస్క్ ద్వారా ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుంది.

ఎన్సిసి, స్పోర్ట్స్, గేమ్స్, కల్చరల్, ఎన్ఎస్ఎస్, మహిళా సాధికారత విభాగాల ద్వారా కార్యక్రమాల నిర్వహణ, కళాశాలలో నిరంతరం జాబ్ మేళాలను నిర్వహించి విద్యార్థులకు ప్రముఖ కంపెనీలలో ఉద్యోగాలు ఇప్పించడం జరుగుతుందనీ కావున ఇంటర్ పాసైన విద్యార్ధినీలు పింగిళి ప్రభుత్వ మహిళా కళాశాలలో డిగ్రీ అడ్మిషన్ తీసుకొని తమ భవిష్యత్ కు బంగారు బాటలు వేసుకోవలసిందిగా కోరారు. కళాశాలకు వచ్చి ఉచితంగా దోస్త్ ద్వారా బి.ఏ,(తె.మీ & ఇం.మీ)  బికాం(కంప్యూటర్స్-ఇం.మీ), బి.కాం (ఈ కామర్స్-ఇం.మీ), బిబిఎ (ఇం.మీ), బిఎస్సీ (ఫిజికల్ సైన్స్- ఇం.మీ), బిఎస్సీ (లైఫ్ సైన్స్-ఇం.మీ), బిఎస్సీ(హెల్త్ కేర్ మేనేజ్మెంట్) లలో అడ్మిషన్ పొందవచ్చు అని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డా. జి.సుహాసిని, ఐక్యూఏ సి, దోస్త్ కో ఆర్డినేటర్ డా. సురేష్ బాబు, అకడమిక్ కో ఆర్డినేటర్  డా.ఎం.అరుణ, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.