calender_icon.png 8 May, 2025 | 10:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత్ లక్ష్యం.. పాకిస్తాన్ కాదు.. ఉగ్రవాదులే: రాజ్‌నాథ్ సింగ్

07-05-2025 06:21:55 PM

న్యూఢిల్లీ: ఆపరేషన్ సింధూర్‌(Operation Sindoor)పై భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Indian Defense Minister Rajnath Singh) స్పందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... మన సైనికులు రాత్రి అద్భుత పరాక్రమం ప్రదర్శించారని పేర్కొన్నారు. మన సైనికులు రాత్రి ఒక చరిత్ర సృష్టించారని, శత్రువుకు సరైన బుద్ధి చెబుతామని రక్షణశాఖ మంత్రి వెల్లడించారు. దేశభద్రతకు భంగం కలిగించే చర్యలను సహించేదే లేదని తెలిపారు. ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా దాడులు నిర్వహించామని, లంకా దహనం చేసిన హనుమంతుడే మాకు ఆదర్శమని అన్నారు. హనుమన్ లంకా దహనం చేసినట్లే మన సైన్యం ఉగ్రవాదులపై దాడి చేశారని, ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్ కు గట్టి సమాధానం ఇచ్చామని పేర్కొన్నారు.

భారత్ లక్ష్యం.. పాకిస్తాన్ కాదు.. ఉగ్రవాదులే అని, పహల్గాంలో అమాయక పౌరులను చంపిన వారినే మట్టుబెట్టామని మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ధైర్యసాహసాలు ప్రదర్శించిన సైనికులకు మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందనలు తెలిపారు. సరిహద్దు రాష్ట్రాల్లో పూర్తి అప్రమత్తంగా ఉన్నామని, ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్ కు గట్టి జవాబిచ్చామని పేర్కొన్నారు. సైనికులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన ప్రధాని మోదీ(Prime Narendra Modi)కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భారత్ లో అనేక దేశాల సంస్కృతులు కనిపిస్తాయని, భారత సంస్కృతి కూడా అనేక దేశాల్లో విస్తరించిందన్నారు. వేల సంవత్సరాలుగా అనేక దేశాలతో మైత్రీభావంతో ఉన్నామని, భారత్ కు వివిధ మార్గాల్లో అరబ్బులు, యూరోపియన్లు వచ్చారని తెలిపారు. దేశవ్యాప్తంగా మౌలిక వసతులు పెంచేందుకు కట్టుబడి ఉన్నామని అన్నారు.