calender_icon.png 9 May, 2025 | 2:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

25 విమానాశ్రయాలు మూసివేత

08-05-2025 12:30:46 AM

పలు విమానాలు కూడా రద్దు

న్యూఢిల్లీ, మే 7: ఉత్తర, పశ్చిమ భారతదేశాల్లో ఉన్న పలు పౌర విమానాశ్రయాలను మూసివేశారు. అంతే కాకుండా కొన్ని విమానాలను కూడా రద్దు చేస్తూ ఉత్తర్వులిచ్చారు. దాదాపు 25 ఎయిర్‌పోర్టులను శుక్రవారం వరకు మూసివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన 165 విమానాలు రద్దయినట్టు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే విమానాలను రద్దు చేసినట్టు పేర్కొన్నారు.

మే 10వరకు సర్వీసులు రద్దు చేస్తున్నట్టు వివరించారు. ఎయిర్ ఇండియా కూడా పలు నగరాలను విమాన సర్వీసులు రద్దు చేస్తున్నట్టు పేర్కొంది. ఎయిర్ ఇండియాతో పాటు ఇండిగో ఎయిర్ లైన్స్ కూడా రీషెడ్యూలింగ్ చార్జీలపై మినహాయింపులు, నగదు వాపసును అందిస్తున్నాయి. ఢిల్లీ విమానాశ్రయం నుంచే 140 విమానాలు రద్దయ్యాయి. దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను కూడా నెట్‌వర్క్ ప్రొవైడర్స్ రద్దు చేశాయి.