calender_icon.png 28 December, 2025 | 1:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమెరికాలో భారత విద్యార్థి అరెస్టు

28-12-2025 12:16:57 AM

కుటుంబ సభ్యులను బెదిరించాడన్న ఆరోపణలు

వాషింగ్టన్, డిసెంబర్ 27: భారత సంతతికి చెందిన ఓ విద్యార్థినిని అమెరికా పోలీ సులు అరెస్టు చేశారు. అయితే నిందితుడికి తెలుగు మూలాలున్నట్లు సమాచారం. సొంత కుటుంబ సభ్యులే అతనిపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే..టెక్సాస్ యూనివర్శిటీలో చదు వుతున్న 22ఏళ్ల మనోజ్ సాయి లేళ్ల అనే భారత సంతతి యువకుడ్ని కొల్లిన్ కౌంటీ పోలీసులు అరెస్టు చేశారు. తరచూ తమపై బెదిరింపులకు దిగుతూ, దాడి చేస్తున్నాడని, తమ ఇంటికి నిప్పు పెట్టడానికి ప్రయత్నించాడని అతడి కటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో కొల్లిన్ కౌంటీ పోలీసులు మనోజ్ సాయి లేల్లను అరెస్టు చేశా రు. మనోజ్‌సాయి కొంతకాలంగా మానసికంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. తమను తీవ్రంగా బెదిరిస్తున్నాడని, గత కొన్ని రోజుల క్రితమే ఇంటికి నిప్పు పెట్టేందుకు కూడా ప్రయత్నించాడని కుటుంబ సభ్యులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు మనోజ్ సాయిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి మనోజ్‌సాయిని అరెస్టు చేశా రు.

తెలిపారు.ఓ ప్రార్థనా స్థలంలో ఉద్ధేశపూర్వకంగా అగ్నిప్రమాదానికి పాల్పడటం, కుటుంబసభ్యులపై ఉగ్ర బెదిరింపులకు దిగడం, తమ ఇంటికి నిప్పు పెట్టడానికి ప్ర యత్నించడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కొంతకాలంగా అతడు పలు మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు.నిందితుడికి కోర్టు రెండు కేసుల్లో కలిపి సుమారు 1,03,500 డాలర్ల బాండ్‌ను ఖరారు చేసింది.