28-12-2025 12:15:19 AM
ఢాకా, డిసెంబర్ 27: బంగ్లాదేశ్‌లోని ఫరీద్‌పూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్ర వారం రాత్రి జరిగిన రాక్‌స్టార్ జేమ్స్ కాన్సెర్ట్‌పై అల్లరిమూక దాడి చేశాయి. కార్యక్రమం ప్రారంభం కానున్న కొద్దినిమిషాల ముందు ఈ ఘటన చోటుచేసుకుంది. ఉన్నట్టుండి ఆందోళనకారులు వేదిక వద్దకు దూసుకొచ్చారు. అల్లరిమూకలు అడ్డువచ్చిన వారిపై విచక్షణ రహితంగా దాడులు చేశాయి. దాడు ల్లో 20 మందికి పైగా విద్యార్థులు గాయపడ్డారు.
దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మూకను భద్రతా బలగాలు చెదరగొట్టాయి. దీంతో అగ్రహించిన అల్లరి మూకలు తిరిగి ఇటుకలు, రాళ్లతో పోలీసులపై దాడులకు దిగాయి. పరిస్థితి అదుపు తీసుకొచ్చేందుకు భద్రత బలగాలు సర్వశక్తులొడ్డాయి. శాంతిభద్రతల దృష్ట్యా కాన్సెర్ట్‌ను రద్దు చేశాయి. దీంతో రాక్‌స్టార్ జేమ్స్ కూ డా వెనుదిరగాల్సి వచ్చింది.