calender_icon.png 28 December, 2025 | 1:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాబా కాళ్లు మొక్కిన పోలీస్

28-12-2025 12:21:01 AM

  1. రాయ్‌పుర్ విమానాశ్రయంలో చోద్యం
  2. ప్రభుత్వ ఖర్చుతో బాబా పర్యటన
  3. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంపై విమర్శల వెల్లువ

ఛత్తీస్‌గఢ్, డిసెంబర్ 27: ఛత్తీస్‌గఢ్‌లో ఓ పోలీస్ ఉన్నతాధికారి ఓ బాబా కాళ్లకు మొక్కడం ఆ రాష్ట్ర రాజకీయల్లో కలకలం రేపింది. బాగేశ్వర్ బాబాగా చలామణి అవుతున్న ధీరేంద్ర కృష్ణశాస్త్రి ఛత్తీస్‌గఢ్ పర్యటన సందర్భంగా శుక్రవారం రాయ్‌పుర్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో బాబాకు స్వాగతం చెప్పేందుకు వచ్చిన ఓ పోలీసు ఉన్నతాధికారి బాబా కాళ్లు మొక్క డం రాజకీయ రచ్చకు దారితీసింది.

ఈ నేపథ్యంలో విపక్షాలు రాష్ట్ర ప్రభుత్వంపై విమ ర్శలు కురిపిస్తున్నాయి. అలాగే బాబా పర్యటనకు ప్రభుత్వ ఖర్చుతో విమానంలో ప్ర యాణించడంపై కూడా ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. ఎలాంటి అధికారిక, రా జ్యాంగపరమైన హోదా లేని మత ప్రబోధకుడికి ప్రభుత్వ విమానం వినియోగించడం ఏంటని విపక్ష నేతలు మండిపడుతున్నారు. ప్రభుత్వ విమానంలో ప్రయాణించడం, ఆయన్ని ఆహ్వానించే క్రమంలో ఓ పోలీసు అధికారి ఆయన కాళ్లకు మొక్కుతున్న వీడి యో సోషల్ మీడియాలో వైరల అయింది. దీంతో ఆ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనమైంది.

దీంతో బాబా పర్యటన కాస్త రాజ కీయం పులుముకొంది. బాగేశ్వర్ బాబా ప్రభుత్వ విమానంలో ప్రయాణించడాన్ని ప్రతిపక్ష నేతలు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నాయి. వీడియోలో బాగేశ్వర్ బాబా రాయ్ పుర్ విమానాశ్రయంలో విమానం దిగిన వెంటనే అక్కడ ఉన్న ఓ పోలీసు అధికారి షూ, టోపీ తీసీ బాబా కాళ్లకు నమస్కరించినట్లు కనిపిస్తోంది.

పోలీసు అధికారి ఈ విధంగా మత ప్రబోధకుడి కాళ్లకు నమస్కరించడం సరైన చర్య కాదని ప్రతిపక్ష కాంగ్రె స్ నేతలు విమర్శలు గుప్పించారు. ఎలాంటి అధికారిక, రాజ్యాంగపరమైన పదవి లేని బాగేశ్వర్ బాబా ప్రయాణానికి ప్రభుత్వ విమానాలను ఎలా ఉపయోగిస్తారని ప్రశ్నించారు. ప్రజల నుంచి పన్ను రూపంలో వచ్చిన డబ్బును రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి అనవసర ఖర్చులకు ఉపయోగిస్తోందని మండిపడ్డారు.

కాగా పోలీసు అధికారిపై వ స్తున్న విమర్శలపై రాయ్‌పూర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్‌ఎస్‌పీ) లాల్ ఉమేద్ సింగ్ దైనిక్ భాస్కర్ స్పందించారు. ఘటన జరిగిన సమయంలో పోలీస్ అధికారి పూర్తి యూనిఫాంలో లేరని.. అప్పటికే అతడు తన టోపీ, షూ తీసివేసినందున సర్వీస్ నిబంధనలను ఉల్లంఘించినట్లు కాదన్నారు.