రాక్బాల్ టోర్నమెంట్లో భారత జట్టు గెలుపు
భారత జాతీయ జట్టులో మెరిసిన పూడూరు యువకుడు గోపాల్ యాదవ్
మేడ్చల్ అర్బన్, జూలై 2 (విజయ క్రాం తి): నేపాల్ రాజధాని ఖాట్మండులో జూన్ 27నుంచి నిర్వహించిన తొలి ప్రతిష్ఠాత్మక దక్షిణాసియా రాక్బాల్ టోర్నమెంట్లో భారత జట్టు అద్భుత ప్రతిభ కనబరిచి ఛాంపియన్గా నిలిచింది. ఉత్కంఠభరితమైన ఫైనల్ మ్యాచ్లో ఆతిథ్య నేపాల్ జట్టును ఓడించి భారత్ ఘన విజయాన్ని సొంతం చేసుకుం ది.
అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో శ్రీ లంకపై విజయం సాధించి ఫైనల్కు చేరిన భారత జట్టు,తుది పోరులోనూ ఆధిపత్యాన్ని ప్రదర్శించి టైటిల్ను కైవసం చేసుకుంది.ఈ విజేత భారత జట్టుకు ఒక లక్ష క్యాష్ ప్రైజ్ తోపాటుగా టీమ్ సభ్యులకు గోల్ మెడల్స్ అందజేశారు. భారత జాతీయ జట్టులో మే డ్చల్ మండలము పూడూరు గ్రామానికి చెం దిన యువ క్రీడాకారుడు ఇటబోయిన గో పాల్ యాదవ్ సభ్యుడిగా ఉండడం పట్ల గ్రా మంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి.
గోపాల్ యాదవ్ సాధించిన ఈ ఘనత పూడూరు గ్రామానికే కాకుండా తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణమని గ్రామస్తులు, శ్రేయోభిలాషులు పేర్కొన్నారు.ఈ సందర్భంగా గోపాల్ యాదవ్కు స్నేహితులు, శ్రే యోభిలాషులు, క్రీడాభిమానులు, గ్రామస్తు లు పలువురు అభినందనలు తెలియజేశా రు. జట్టుకు విజయంతో పాటు యువతకు స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు.






