19-10-2025 12:00:00 AM
మహిళల వన్డే ప్రపంచకప్
ఇండోర్, అక్టోబర్ 18: మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు డూ ఆర్ డై మ్యాచ్‌కు సిద్ధమైంది. వరుస ఓటములతో సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న భారత్ ఆదివారం ఇండోర్ వేదికగా ఇంగ్లాండ్‌తో తలపడబోతోంది. మెగాటోర్నీని వరు సగా రెండు విజయాలతో ఘనంగా ఆరంభించిన హర్మన్ ప్రీత్ కౌర్ అండ్ టీమ్ తర్వా త వరుసగా సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలైంది. ప్రస్తుతం 4 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతున్న భారత్ ఇతర జట్లతో సంబంధం లేకుండా సెమీఫైనల్‌కు చేరాలంటే మిగిలిన 3 మ్యాచ్ లూ గెలిచి తీరాల్సిందే. ఒక్కటి ఓడినా రన్‌రేట్, ఇతర జట్ల సమీకరణాలపై ఇంగ్లాండ్ తో భారత్‌కు చావోరేవోఆధారపడాల్సి ఉం టుంది.
దీంతో ఇంగ్లాండ్‌తో మ్యాచ్ ఒకవిధంగా భారత్‌కు చావోరేవో పోరుగానే చెప్పాలి. నిజానికి ఈ టోర్నీ ఆరంభానికి ముందు టీమిండియా ఆసీస్‌తో సిరీస్‌లో బాగానే ఆడింది. తీరా వరల్డ్‌కప్‌లో మాత్రం నిరాశపరుస్తోంది. బ్యాటింగ్‌లో హర్మన్‌ప్రీత్‌కౌర్ వైఫల్యం మిడిలార్డర్‌పై ఒత్తిడి పెంచు తోంది. ఆరంభ మ్యాచ్‌లలో నిరాశపరిచిన స్మృతి మంధాన గత మ్యాచ్‌లో మళ్ళీ ఫామ్ అందుకుంది. మిగిలిన బ్యాటర్లు కూడా నిలకడగా రాణిస్తే మంచి స్కోర్లు చేయొచ్చు. అ టు బ్యాటర్లు ఎక్కువ డాట్ బాల్స్ ఆడుతుండడం కూడా మైనస్‌గా మారింది. గత నాలు గు మ్యాచ్‌లలోనూ ఇతర జట్లతో పోలి స్తే మన జట్టే ఎక్కువ డాట్ బాల్స్ ఆడింది. కెప్టెన్‌గానూ హర్మన్ ప్రీత్ నిరాశపరుస్తోంది.
ఫీల్డింగ్ మోహరింపు, బౌలర్ల మార్పు వంటి కీలక అంశాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించలేకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇది లా ఉంటే బౌలర్ల వైఫల్యం కూడా భారత్ కొంపముంచుతోంది. నిజానికి సౌతాఫ్రికా, ఆసీస్ మ్యాచ్‌లఉ రెండూ కూడా భారత్ గెలవాల్సినవే. డెత్ ఓవర్లలో పేలవ బౌలింగ్‌తో ప్రత్యర్థికి మ్యాచ్‌లను అప్పగించింది. బౌలిం గ్ కాంబినేషన్‌లో మార్పులు చేయకుంటే మాత్రం కష్టమే. ఆరో బౌలర్ కోటాలో ఆల్‌రౌండర్ రాధాయాదవ్‌ను జట్టులోకి తీసు కుంటే మంచిది. ఫీల్డింగ్ పరంగా బాగానే రాణిస్తుండడం కాస్త రిలీఫ్.
మరోవైపు ఇంగ్లాండ్ వరుస విజయాల తో అదరగొడుతోంది. సౌతాఫ్రికా, శ్రీలం క, పాకిస్థాన్ జట్లపై గెలిచి ప్రస్తుతం పా యిం ట్ల పట్టికలో మూడో ప్లేస్‌లో కొనసాగుతోం ది. ఇప్పుడు భారత్‌పై గెలిస్తే ఇంగ్లాండ్ దా దాపుగా సెమీస్‌కు చేరినట్టే. పాక్ తో మ్యాచ్ లో ఇంగ్లాండ్‌ను వరుణుడు కాపాడాడు. ఆ జట్టు 31 ఓవర్లలో కేవలం 131 పరుగులే చేసింది. వర్షంతో మ్యాచ్ రద్దవడం తో ఓట మి తప్పించుకోగలిగింది. అలాగని ఇంగ్లాండ్‌ను తేలిగ్గా తీసుకుంటే ప్రమాదమే.