19-10-2025 12:00:00 AM
ట్రై సిరీస్ బహిష్కరించిన అఫ్గనిస్థాన్
న్యూఢిల్లీ, అక్టోబర్ 18: పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తారాస్థా యికి చేరుకున్నాయి. ఈ క్రమంలో పాక్ మరోసారి వైమానికి దాడులకు పాల్పడింది. డ్యూ రాండ్ రేఖ వెంబడి పాక్టికాలో వైమానికి దాడులు చేసింది. ఈ దాడుల్లో పది మంది మృతి చెందగా.. ముగ్గురు అఫ్గానిస్తాన్ దేశవాళీ క్రికెటర్లు ఉన్నారు. ఫ్రెండ్లీ మ్యాచ్ కో సం పాక్టికా వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. దాడుల్లో మృతి చెంది న యువ క్రికెటర్లు కబీర్ అఘా, సిబ్గుతుల్లా, హరూర్‌లకు నివాళి అర్పిస్తూ అఫ్గానిస్థాన్ క్రికెట్ బో ర్డు ట్వీట్ చేసింది. ఈ దాడికి నిరసనగా వచ్చే నెలలో జరగనున్న ట్రై సిరీస్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. ట్రై సిరీస్‌లో పాక్ ఉండడంతోనే ఈ నిర్ణ యం తీసుకున్నట్టు తెలిపింది. షెడ్యూల్ ప్రకారం పాక్, శ్రీలంక జట్లతో అఫ్గాన్ ట్రై సిరీస్ ఆడాల్సి ఉంది.