01-09-2025 02:57:16 PM
మంచిర్యాల, (విజయక్రాంతి): మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్ లో బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్(BRSV State President Gellu Srinivas), బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువ నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ ఆదేశాల మేరకు సోమవారం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) చిత్రపటానికి, అమరవీరుల స్థూపానికి, తెలంగాణ తల్లి విగ్రహానికి బీఆర్ఎస్వి నియోజకవర్గ అధ్యక్షుడు దగ్గుల మధు కుమార్ ఆధ్వర్యంలో పాలాభిషేకం, జలాభిషేకం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ జాతిపిత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం తెలంగాణ సమాజాన్ని అవమానపరిచినట్లు అవుతుందన్నారు.
సబ్బండ వర్గాల మేలు కోసం ఎనలేని కృషి చేసిన కేసీఆర్ ని దూషించడం అనేది ఆకాశ మీద ఉమ్మేసినట్టేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, లేకుంటే విద్యార్థి విభాగం తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని మంచిర్యాల బిఆర్ఎస్ విద్యార్థి విభాగం తరఫున హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యువజన విభాగ నాయకులు కాటమరాజు, నోముల నరేందర్ రెడ్డి, కందుల ప్రశాంత్, గోశిక మధుకర్, మహమ్మద్ సాజిద్, ఇరుగురాల వంశీ, కొత్త శ్రీనివాస్, గుమ్ముల ప్రవీణ్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కౌన్సిలర్ హైమద్, పట్టణ ప్రధాన కార్యదర్శి మెరుగు పవన్, తదితరులు పాల్గొన్నారు.