calender_icon.png 21 October, 2025 | 10:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేస్తం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం

21-10-2025 08:24:20 PM

బూర్గంపాడు (విజయక్రాంతి): మండలంలోని నాగినేనిప్రోలు గ్రామానికి చెందిన షేక్ ఖావుద్దిన్ పక్షవాతంతో బాధపడుతున్నాడు. ఆర్థిక పరిస్థితి బాగలేక మోరంపల్లి బంజర్ గ్రామానికి చెందిన నేస్తం వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ సంప్రదించాడు. వారు వెంటనే స్పందించి నేస్తం వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ తరుపున రూ.6,000, సంకా సురేష్ రూ.1000, మొత్తం రూ.7000 రూపాయలను అందజేశారు‌.

ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ బత్తుల రామకొండా రెడ్డి మట్లాడుతూ షేక్ ఖావుద్దిన్ కు 67 సంవత్సరాలు ఉన్నప్పటికీ కనీసం వృద్దాప్యం ఫించన్ రాకపోవడం లేదని, పూరి గుడిసె కావడంతో ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితిలో ఉన్నాడని తెలిపారు. వీరి కుటుంబానికి ప్రభుత్వం వృద్దాప్య ఫించన్ ,ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని కోరారు.నేస్తం ట్రస్ట్ తరుపున అధికారులను కోరుతూ ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ చింత అంకిరెడ్డి,సెక్రటరీ ఇండ్ల వెంకట రాజేష్ ,గౌరవ సలహాదారులు సంకా సురేష్ ,సభ్యులు కైపు రమేష్ రెడ్డి పాల్గొన్నారు.