16 March, 2026 | 2:27 AM

ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా?

16-03-2026 01:00 AM

ఎదిరలో నిరుపేద క్రిష్ణయ్య ముదిరాజ్ కు దక్కని ఇందిరమ్మ ఇల్లు 

ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ రెడ్డి 

షాద్‌నగర్ మార్చి 15 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లపేరుతో  ఇల్లు పంపిని మొదలుపెట్టి  అర్హులైన పేదవాళ్ళకి ఇవ్వకుండా తమకు పార్టీ నాయకులకు మాత్రమే ఇల్లను కేటాయించడం   సమంజసం కాదని ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అన్నారు. ఆదివారం షాద్నగర్ నియోజకవర్గం లోని జిల్లెడు చౌదరి కూడా మండలంలోని ఎగిరే గ్రామంలో  నిరుపేద కృష్ణయ్య ముదిరాజ్ నివసిస్తున్న పూరిగుడిసెను స్థానిక నాయకులతో కలిసి సందర్శించారు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి.ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి ఇందిరమ్మ ఇల్లుకు అర్హులైన క్రిష్ణయ్య కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ జరిగిన విషయాన్ని అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో అత్యంత అర్హత కలిగిన అర్హునికి ఇవ్వకుండా రాజకీయ కక్ష సాధింపు చర్యకు స్థానిక నాయకులు మండల అధికారులు చేస్తున్నారని కాంగ్రెస్ కండువా కప్పుకుంటేనే ఇల్లు సాంక్షన్ చేస్తాననడం దుర్మార్గమని ప్రభుత్వం ఏదైనా ముందుగా అర్హులైన పేదలను గుర్తించి ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని అలా కాకుండా సాక్షాత్తు మండల అధికారి ఎంపీడీవోనే కాంగ్రెస్ కండువా కప్పుకుంటేనే ఇల్లు సాంక్షన్ చేస్తానడం సిగ్గుచేటు అని అధికారులను ఉద్దేశించి మాట్లాడారు రాబోయే లిస్టులో అన్ని అర్హతలు ఉన్న క్రిష్ణయ్యకు ఇల్లు మంజూరు చేయకపోతే  పెద్ద ఎత్తున మండలం పరిషత్ ఆఫీసు వద్ద స్థానిక అర్హులతో ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. 

ఈ కార్యక్రమంలో సర్పంచ్ అనూష రవీందర్ రెడ్డి,ఎదిర సర్పంచ్ విజయలక్ష్మ, మాజీ ఎంపిటిసి ప్రమోద్ పంతులు, ముష్టిపల్లి సర్పంచ్ జంగయ్య,ఉమెంతల్ మాజీ సర్పంచ్ నర్సిమ, అయోధ్య పూర్ మాజీ సర్పంచ్ గోపాల్ నాయక్ గ్రామస్తులు,శ్రీనివాస్ రెడ్డి,వెంకటేష్ బీర్‌ఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.