19-11-2025 11:30:12 AM
ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి
కడ్తాల్ /ఆమనగల్లు:(విజయక్రాంతి): కల్వకుర్తి నియోజకవర్గం లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలు శరవేగంగా కొనసాగుతున్నాయని, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి(MLA Kasireddy Narayan Reddy) హామీని ఇచ్చారు. అమంగల్ మున్సిపాలిటీ పరిధిలోని మూర్తు జపల్లి గ్రామంలో ఇందిరమ్మ పథకం కింద మంజూరైన ఇంటి నిర్మాణం పూర్తవడంతో లబ్ధిదారులు గృహప్రవేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి, లబ్ధిదారులు అధికారులతో కలిసి గృహప్రవేశం చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులను ఆయన అభినందించి శాలువతో సత్కరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరు సభ్యులు చేసుకోవాలని ఆయనకోరారు.
మండల కేంద్రంలోని ఎంబీఏ గార్డెన్ లో కడ్తాల్,తలకొండపల్లి మండలాలకు చెందిన 84 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకం కింద మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో లబ్ధిదారుల నుంచి ఎక్కడ వసూల్ కు పాల్పడుద్దని ఆయన హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో కల్వకుర్తి నియోజకవర్గం ను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకెళ్తానని ఆయన చెప్పారు. కాంగ్రెస్ శ్రేణులు స్థానికంగా ఉంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన కోరారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో అన్ని స్థానాలను గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అంతకుముందు మాదక ద్రవ్యాలు డ్రగ్స్ కు వ్యతిరేకంగా యువత నడుం బిగించాలని ఆయన పిలుపునిచ్చారు.కార్యక్రమంలో ఏఎంసీ చైర్ పర్సన్ యాట గీత, వైస్ చైర్మన్ భాస్కర్ రెడ్డి, తహసిల్దార్ జయశ్రీ, సింగిల్ విండో చైర్మన్ గంప వెంకటేష్, ఎంపీడీవో సుజాత, డిప్యూటీ తహసీల్దార్లు ఆదిత్య, పిసిసి సభ్యులు శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పాలకూర్ల రవికాంత్ గౌడ్, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, కరుణాకర్ గౌడ్, సుమన్, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.