calender_icon.png 19 November, 2025 | 12:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీసుల వేధింపులతో ఆస్పత్రి పాలైన వ్యక్తి

19-11-2025 11:27:56 AM

హన్మకొండ,(విజయక్రాంతి): సివిల్ కేసులో జోక్యం చేసుకోవద్దని డీ జీపీ ఆదేశాలు ఉన్నప్పటికీ కొంతమంది పోలీస్ అధికారులు ఆదేశాలను తుంగలో తొక్కి సివిల్ తగాదాల్లో జోక్యం చేసుకొని బాధితులను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు ఉన్నాయి.హన్మకొండ నక్కలగుట్టకు చెందిన బొజ్జ దేవేందర్ రాజు అనే వ్యక్తిని ఈ నెల 12 న సుబేదారి పోలీస్ స్టేషన్ కు వెళ్లగా అక్కడ విధుల్లో ఉన్న ఎస్ ఐ సుమన్ అకారణంగా, దుర్భాషలాడి, కొట్టాడని బాధితుడు ఒక ప్రకటనలో తెలిపాడు. అంతేకాకుండా మొబైల్ ఫోన్ లాక్కొని, భయభ్రాంతులకు గురి చేసాడు అన్నాడు.

అదే రోజు రాత్రి 9వరకు నిర్బంధించినట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.తనకు ఆరోగ్యం బాగా లేదని ,కడుపు నొప్పి వస్తుందని చెప్పినప్పటికీ, ఎస్ ఐ వినలేదని తెలిపాడు. తనకు ఘనపూర్ లో ఉన్న ఫ్లాట్ విషయం లో నక్కలగుట్టలో కెనరా బ్యాంక్ విధులు నిర్వహిస్తున్న ఆడెపు రజిత తో భూ వివాదం కొనసాగుతుందని,ఆమె తనవద్ద ఖరీదు చేసిన 290 గజాల ఫ్లాట్లను చట్టప్రకారం రిజిసేషన్ చేయించడం జరిగిందన్నారు.మిగతా కాళి స్థలం కూడా తనకే విక్రయించాలని ఆమె స్థానిక పోలీసు అధికారులతో ఒత్తిడి తెస్తున్నట్లు వాపోయాడు.గతం లో కూడా కాజీపేట పోలీసులు కూడా ఆడెపు రజిత విషయంలో ఇదే రకమైన వేధింపులకు పాల్పడినట్లు బహాదితుడు వాపోయాడు.సుబేదారి ఎస్ ఐ సుమన్ వేధింపులతో అదేరోజు ఎంజీఎం. ఆసుపత్రిలో  చేరి చికిత్స పొందినట్లు తెలిపారు.ఇదే కేసు విషయంలో అడ్వకేట్ పశుపతి తో నోటీస్ పంపించినట్లు బాధితుడు తెలిపారు..     

ఎస్సై సుమన్ వివరణ

ఈనెల 12న కెనరా బ్యాంకు ఉద్యోగి ఆడేపు రజిత తన దగ్గర డబ్బులు తీసుకొని తనకు భూమి రిజిస్ట్రేషన్ చేయించడం లేదంటూ బొజ్జ దేవేందర్ రాజు పై ఫిర్యాదు చేసింది, దాని విషయంలో దేవేందర్ రాజ్ మీద చీటింగ్ కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అంతేగాని దేవేందర్ రాజు పైన చేయి చేసుకున్న విషయం అవాస్తమన్నారు. చట్ట ప్రకారమే కేసు బుక్ చేశామన్నారు.