26-07-2025 12:00:00 AM
అలంపూర్ ,జూలై 25 అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చే స్తామని తెలంగాణ రాష్ట్ర టెలికం అడ్వైజరీ కమిటీ మెంబర్ ఇస్మాయిల్ అన్నారు.శుక్రవారం అలంపూర్ పట్టణంలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు చేపట్టిన ఇంటి నిర్మాణాలను స్థానిక నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు.ఎఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ ఆదేశాలను మేరకు పట్టణంలోని ఇండ్లు లేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని తె లిపారు.ఈ కార్యక్రమంలో మద్దిలేటి, బాబు, డేరన్, వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.