calender_icon.png 27 July, 2025 | 12:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూభారతి పట్టా అందజేత

26-07-2025 12:00:00 AM

బాన్సువాడ, జూలై 25 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన భూ భారతి చట్టం  రెవెన్యూ సదస్సు లో వచ్చిన దరఖాస్తు దారులకు  సోమూర్ గ్రామానికి చెందిన హనుమంత్ వార్ శివ నంద, ఎబిత్వర్ పూల లబ్ధిదారులకు బాన్సువాడ సబ్ కలెక్టర్ కొప్పిశెట్టి కిరణ్మయి శుక్రవారం భూభారతి పట్టాను అందజేశారు.

కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల తహసీల్దార్ కార్యాలయం లో  భూ భారతి రెవెన్యూ పట్టా హక్కు పత్రాలను అందజేశారు. పట్టా హక్కులు పొందిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ ఎం డి ముజీబ్, గిర్దవార్ శంకర్, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.