15 April, 2026 | 1:54 PM

Breaking News

పేకాట ఆడుతున్నారనే నెపంతో ఎస్ఐ దాడి... పోలీస్ స్టేషన్ ఎదుట 100 మంది ధర్నా   •   ధాన్యం కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించాలి.. సీపీఐ డిమాండ్   •   చీల‌ప‌ల్లిలో పొంగిపొర్లుతున్న నిర్లక్ష్యం   •   మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిపై దాడి   •   అక్రమాలు ప్రశ్నిస్తే కక్ష కట్టారు   •   ఎక్సైజ్ కోర్టు కానిస్టేబుల్ కు ఘనంగా వీడ్కోలు   •   ట్రాక్టర్ డీకొని బాలుడికి తీవ్రగాయాలు   •   గ్రామీణ అభివృద్ధితో ప్రజల జీవన ప్రమాణాల పెంపు లక్ష్యం   •   టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •  

అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు

07-05-2025 05:09 PM

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్...

జైపూర్/చెన్నూర్ (విజయక్రాంతి): అర్హత కలిగిన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు ప్రభుత్వపరంగా ఇస్తున్నామని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్(District Collector Kumar Deepak) అన్నారు. బుధవారం జైపూర్ మండలం గంగిపల్లి గ్రామంలో జరుగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను మండల పరిషత్ అభివృద్ధి అధికారి సత్యనారాయణతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రభుత్వం అర్హులైన నిరుపేదలకు గూడు కల్పించాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ఇండ్లు అందించడం జరుగుతుందని తెలిపారు.

సొంత స్థలం కలిగి ఉండి ఇంటి నిర్మాణానికి ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఆర్థిక సహాయం పొందిన లబ్ధిదారులు తమ ఇండ్లను నిబంధనల ప్రకారం 600 చదరపు గజాలలోపు నిర్మించుకోవాలన్నారు. అర్హత గల ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల జాబితా రూపొందించాలని, జాబితా తయారీలో పారదర్శకంగా వ్యవహరించాలని తెలిపారు. జాబితాలో అర్హుల పేర్లు మాత్రమే ఉండాలని, అనర్హుల వివరాలు ఉన్నట్లయితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి శ్రీపతి బాపు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.