calender_icon.png 8 May, 2025 | 6:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిజాయితీని చాటిన ఆర్టీసీ డ్రైవర్

07-05-2025 05:06:28 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ ఆర్టీసీలో విధులు నిర్వహిస్తున్న బస్ డ్రైవర్ మహేష్ బుధవారం నిజాయితీని చాటుకున్నారు. నిర్మల్ డిపోలో విధులు నిర్వహిస్తున్న మహేష్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు బస్సులో వెళుతుండగా భూమేష్ అనే ప్రయాణికుడు తన బ్యాగును బస్సులోనే మరిచి వెళ్లిపోయాడు. ఆ బ్యాగును గమనించగా 21 వేల నగదు, సెల్ఫోన్ ఉండడంతో అతని చిరునామా ద్వారా సమాచారం అందించి సీఐ ఆధ్వర్యంలో అతనికి అప్పగించారు. నిజాయితీని చాటుకున్న డ్రైవర్ కు ఆర్టీసీ సిబ్బంది అభినందనలు తెలిపారు.