07-05-2025 05:15:28 PM
నిర్మల్ (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా ధూప దీప నైవేద్య పథకానికి సంబంధించి నాయక్ పోడ్ ల ఆరాధ్య దైవం భీమన్న ఆలయాలను వర్తింపజేయాలని తుడుం దెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకగారి భూమయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ప్రకటనలో వారు మాట్లాడుతూ... నోటిఫికేషన్ లో గిరిజనుల ఆలయాలకు అని ఇస్తున్నప్పటికీ గిరిజన తెగకు చెందిన భీమన్న ఆలయాలకు ఇప్పటివరకు ధూప దీప నైవేద్యాన్ని వర్తింప చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రాష్ట్రంలోని అన్ని భీమన్న ఆలయాలకు ధూప దీప నైవేద్య పథకాన్ని అమలు చేస్తూ నాయక్ పోడ్ ల అభ్యున్నతికి పాటుపడాలని కోరారు. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చర్యలు చేపడతామని హెచ్చరించారు. కొన్ని గిరిజన ఆలయాలకు ధూప దీప నైవేద్య పథకాన్ని అందిస్తూ ఇతర గిరిజన ఆలయాలపై వివక్ష చూపడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు.