14 March, 2026 | 2:53 AM

కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పేదలకు ఇందిరమ్మ ఇండ్లు: మంత్రి జూపల్లి కృష్ణారావు

14-03-2026 01:56 AM

కొల్లాపూర్ రూరల్, మార్చి 13: నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం మొల్లచింతలపల్లి గ్రామంలో మొదటి ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు నిర్వహించారు. కవిత, పుల్లయ్య కుటుంబానికి మంజూరైన ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించి, కుటుంబ సభ్యులకు అక్షింతలు వేసి బట్టలు అందజేసి ఆశీర్వదించారు.

అనంతరం నిర్వహించిన భూముల రీ సర్వే సదస్సులో మంత్రి మాట్లాడుతూ మొల్లచింతలపల్లి, నార్లాపూర్ గ్రామాల్లో పోడు భూములు, పట్టా భూములపై రీ సర్వే నిర్వహించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లే కుండా చూడాలని అధికారులను ఆదేశించారు. గతంలో తాను మంత్రిగా ఉన్న సమయంలో జిల్లర్ తిప్ప ఆయకట్టు సంబంధించి రూ.16 కోట్లతో మూడు వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు పనులు మంజూరు చేసినట్లు తెలిపారు. అయితే ఆ తర్వాత పనులు సక్రమంగా సాగ లేదని పేర్కొన్నారు.

ప్రస్తుతం నార్లాపూర్, మొల్లచింతలపల్లి ప్రాంత రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా జిల్లర్ తిప్ప ప్రాజెక్టుకు అదనంగా రూ.160 కోట్లు మంజూరు చేస్తానని మంత్రి హా మీ ఇచ్చారు.ఈ సందర్భంగా మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అమరేందర్, కొల్లాపూర్ ఆర్టీవో బన్సులాల్, మొల్లచింతలపల్లి సర్పంచ్ మేకల వరలక్ష్మి, అధికారులు, మహిళలు, కాంగ్రెస్‌నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.