04-06-2025 12:12:30 AM
జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగు వాన్
కామారెడ్డి, జూన్03, (విజయ క్రాంతి) : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు త్వరగా నిర్మించుకునే లా లబ్ధిదారులను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్లు లబ్దిదారులకు, ఇంటి నిర్మాణానికి ముగ్గు వేసి మంజూరి పత్రాలు అంధ చేసినారు. త్వరగా ఇంటి నిర్మాణం చేసుకో వాలని లబ్ధిదారులకు కలెక్టర్ తెలిపారు.
అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను లబ్ధిదారు లు త్వరగా నిర్మించుకునే విధంగా అధికారులు ప్రోత్సహించాలని తెలిపారు. అనంతరం ఇండ్ల నిర్మాణం పత్రాన్ని లబ్ధిదారురాలు పిట్టల రాధిక కు కలెక్టర్ ఆశిష్ సంగు వాన్ అందజేశారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పిడి.విజయపాల్ రెడ్డి, MPDO, తాసిల్దార్, స్పెషల్ ఆఫీసర్ హౌసింగ్ AE , తదితరులు పాల్గొన్నారు.
భూభారతి చట్టంతో భూ సమస్యల పరిష్కారం
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న భూభారతి చట్టం వల్ల ప్రజల భూ సమస్యలు త్వరగా పరిష్కారం పొందుతున్నాయని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు.మంగళవారం కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రంలో గజ్జ నాయక్ తండలో రైతు వేదిక లో నిర్వహించిన గ్రామ రెవెన్యూ సదస్సుల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజల భూ సమస్యలను పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యం.
ఇందుకోసమే భూభారతి చట్టాన్ని తీసుకొచ్చారని తెలిపారు. ఇప్పటికే తొలి విడత సదస్సులు విజయవంతంగా ముగిశాయని, నేటి నుండి జూన్ 20వ తేదీ వరకు రెండో విడత రెవెన్యూ సదస్సులు జరుగుతాయని వెల్లడించారు. సదస్సుల్లో పాల్గొన్న ప్రజల భూములకు సంబంధించిన సమస్యలను కలెక్టర్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. రెవెన్యూ అధికారులు ప్రజల దరఖాస్తులను స్వీకరించి, వెంటనే రసీదులు ఇవ్వాలని ఆదేశించారు.
సకాలంలో సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సదస్సుకు సుమారు 100 మంది రైతులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలోఅదనపు కలెక్టర్ (రెవెన్యూ ) విక్టర్, కామారెడ్డిఆర్డిఓ వీణ, మండల స్పెషల్ ఆఫీసర్ రమేష్, తహసీల్దార్లు సరళ, ఎంపీడీవో , ఎస్త్స్ర అనిల్, వ్యవసాయ అధికారి పవన్ ఎఫ్ ఆర్ ఓ దివ్య , అధికారులు, తదితరులు పాల్గొన్నారు.