calender_icon.png 14 July, 2025 | 9:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపు మంత్రివర్గ సమావేశం

04-06-2025 12:12:04 AM

కాళేశ్వరం, సంక్షేమ పథకాలు, అభివృద్ధిపై చర్చ 

హైదరాబాద్, జూన్ 3 (విజయక్రాంతి): తెలంగాణ మంత్రివర్గం గురువారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో భేటీ కానున్నదని సీఎస్ రామకృష్ణారావు మం గళవారం ప్రకటనలో పేర్కొన్నారు. ఈ భేటీలో రాజీవ్ యువవికాసం, వానాకాలంలో పంటలు, ఇందిర మ్మ ఇళ్లు, భూభారతి, ధాన్యం కొనుగోళ్లతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విజిలెన్స్ కమిషన్ ఇచ్చిన నివేదికపై చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.

వీటితో పాటు ఉద్యోగుల సమస్యలపై ఏర్పాటైన ఉన్నతాధికారుల కమిటీ తన నివేదికపైనా ఎ లాంటి నిర్ణయం తీసుకోబోతున్నద నే విషయం ఉత్కంఠగా మారింది.  త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గాల్లో పెండింగ్ పను లపై చర్చించే అవకాశం ఉంది.