calender_icon.png 7 July, 2025 | 4:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల అవకతవకలపై మంత్రి శ్రీధర్ బాబుకు వినతి

04-06-2025 12:12:57 AM

ఘట్ కేసర్, జూన్ 3 (విజయక్రాంతి) : ప్రతాపసింగారంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీలో జరిగిన అవకతవకలపై ఆ గ్రామ మాజీ సర్పంచ్ శివకుమార్ మంగళవారం నగరంలోని సెక్రటేరియట్ వద్ద స్థానిక శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డితో కలిసి మంత్రి శ్రీధర్ బాబుని కలిసి వినతిపత్రం అందజేశారు.

గ్రామంలో జరుగుతున్న డబుల్ బెడ్ రూమ్ ల అవకాతవకల గురించి మంత్రికి అందజేసిన వినతిపత్రంలో పేర్కొనడం జరిగింది.  వెంటనే మంత్రి శ్రీధర్ బాబు సానుకూలంగా స్పందిస్తూ మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ కి ఫోన్ చేసి మరొకసారి విచారణ జరిపి అర్హులైన ప్రతి ఒక్కరికి డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చే విధంగా మంత్రి శ్రీధర్ బాబు కలెక్టర్ గారికి ఆదేశించడం జరిగిందని తెలిపారు.