calender_icon.png 5 August, 2025 | 4:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలి

02-08-2025 12:59:30 AM

ములుగు,ఆగస్టు1(విజయక్రాంతి): ఇందిరమ్మ పథకం ద్వారా మంజూరైన ఇండ్ల నిర్మాణాలు శరవేగంగా,నాణ్యతతో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ అన్నారు శుక్రవారం ములుగు మండలం జగ్గన్నపేట గ్రామంలోని చిన్న గుంటూరు పల్లిలో అన్నంపల్లిలో జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ లబ్ధిదారులతో మాట్లాడి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మాణ పనుల్లో జాప్యం జరగకుండా చూడాలని ప్రతి ఇంటి నిర్మాణాన్ని నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

లబ్ధిదారులకు నిర్మాణ పద్ధతులపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అవసరమైన మౌలిక సదుపాయాలు (విద్యుత్,నీరు,రోడ్లు)అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. 

ఇసుక ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ చేస్తూ తగిన మార్గదర్శకాలను పాటిస్తేనే లక్ష్యాన్ని సకాలంలో చేరగలమని తెలిపారు. నిర్మాణాలు పూర్తయిన వెంటనే లబ్ధిదారులు గృహ ప్రవేశం చేయగల పరిస్థితులు కల్పించాలన్నారు.

విద్యార్థులకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలి

 ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.అన్నారు.శుక్రవారం ములుగు మండలంలోని దేవగిరిపట్నం మైనార్టీ రెసిడెన్షియల్ హాస్టల్ను జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. సందర్శించారు.మైనారిటీ గురుకుల పాఠశాలను సందర్శించిన కలెక్టర్ వంటగది సరుకుల గదిని,విద్యార్థులు నిద్రించే గదులను తనిఖీ చేశారు. 

రిజిస్టర్లను పరిశీలించారు.   సీజనల్ వ్యాధుల నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.  స్టడీ అవర్స్ లో ఉన్న విద్యార్థులతో  కలెక్టర్  మాట్లాడి విద్యార్థులను ఇంగ్లీష్ కు సంబంధించిన ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు.

ఆ ఆరు అంశాలు గుత్తి కోయగూడాలకు చేరాలి

 నీతి ఆయోగ్ సూచించిన ఆరు అంశా లను చిట్టచివర ఉన్న గుత్తికోయగూడాలకు అందించాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్. అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ములుగు జిల్లా కన్నాయిగూడెం ఆకాంక్షా బ్లాక్, సంపూర్ణత అభియాన్ సమ్మాన్ సమారోహ్ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 

ఈ సంద ర్భంగా  ఆరోగ్యం,ఫవిద్య, వ్యవసాయం, ఆర్థిక అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన వంటి కీలక రంగాలలో విశేష కృషి చేసిన జిల్లా, బ్లాక్ స్థాయి అధికారులను, వారి నిబద్ధతకు, అంకితభావానికి సత్కరించడం జరుగుతుందన్నారు.