calender_icon.png 6 August, 2025 | 7:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోగులకు మెరుగైన వైద్యం అందించాలి

02-08-2025 12:57:30 AM

  1. సీజనల్ వ్యాధులు రాకుండా అవగాహన కల్పించాలి
  2. క్షేత్రస్థాయిలో వైద్య క్యాంపులు నిర్వహించాలి
  3. నిత్యం ప్రజలకు వైద్యులు అందుబాటులో ఉండాలి.
  4. సరిపడా మందుల నిల్వలు ఉండాలి
  5. స్పెషల్ ఆఫీసర్ తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ ప్రాజెక్టు 
  6. డైరెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ రెడ్డి ఐఏఎస్

ములుగు, ఆగస్టు 1(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి వర్యుల ఆదేశాల మేరకు సీజనల్ వ్యాధుల నియంత్రణ పర్యవేక్షణ ప్రత్యేక అధికారి గా నియమాకం అయిన (ఉమ్మడి వరంగల్ జిల్లాలకు )తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, ప్రాజెక్ట్ డైరెక్టర్ వాసం వెంకటేశ్వర్ రెడ్డి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీజనల్ వ్యాధుల నియంత్రణ పర్యవేక్షణ ప్రత్యేక అధికారి తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, ప్రాజెక్టు డైరెక్టర్ వాసం వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు.

రాష్ట్రంలో సీజనల్ వ్యాధులను నియంత్రించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఆరోగ్య శాఖ మంత్రి సెక్రటరీ,హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ లు ప్రత్యేక అధికారిగా నియమించిన సందర్బంగా శుక్రవారం ప్రత్యేక అధికారి ములుగు జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రిని సందర్శించారు.ఈ సందర్భంగా హాస్పటల్ యందు ఫీవర్ వార్డును పరిశీలించి జ్వరంతో చికిత్స పొందుతున్న రోగుల వివరాలను అడిగి తెలుసుకుని వారికి వైద్య సేవలు ఏవిధంగా అందుతున్నాయని వైద్యులు మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నారా అని ఆరా తీశారు .

వరంగల్ జిల్లా సీజనల్ వ్యాధులపై ప్రభుత్వము నియమించిన స్పెషల్ ఆఫీసర్ తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ రెడ్డి ఐఏఎస్ ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడుతూ మారుమూల గ్రామాలలో దోమల నియంత్రణకు యాంటీ లార్వా స్ప్రే చేయాలని, నీరు నిల్వ ఉన్న ప్రాంతాలలో ఆయిల్ బాలు వేసి దోమల నియంత్రణ గావించి మలేరియా డెంగ్యూ చికెన్ గున్యా లాంటి వ్యాధులను నియంత్రించాలని ఆరోగ్య సిబ్బందికి సూచించారు.

పంచాయతీరాజ్ శాఖ జిల్లా అధికారులు,మండలాధికారులు,గ్రామపంచాయతీ కార్యదర్శులతో వైద్య ఆరోగ్యశాఖ సమన్వయ పరచుకొని గ్రామాలలో పరిశుభ్రతను ఏర్పరచాలని మురికి కాలువలో నీటి నిల్వలు ఉండకుండా చూడాలని కాలువలపై ఆంటీ లార్వా స్ప్రే చేయాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల లో రాపిడ్ రెస్పాన్స్ టీమ్లను ఉప కేంద్రాలలో మానిటరింగ్ సూపర్వైజర్ లను నియమించి.

ఈ వర్షాకాలంలో వచ్చే మలేరియా డెంగ్యూ వ్యాధులను నియంత్రించడానికి పటిష్టమైన ప్రణాళికలను తయారు చేశామని, ఆరోగ్య కేంద్రాలలో పరీక్షల కొరకు రి ఏజెంట్లను కొనుగోలు చేయుటకు మరియు ఎమర్జెన్సీ మందుల నిమిత్తము నిధులను మంజూరు చేశామని గ్రామాలలో వైద్య శిబిరాలు నిర్వహించడానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు తోపాటు ఆర్బీఎస్కే ఎంసిహెచ్ ఎప్పుడేమిక్ టీంలతో పాటు ఆయుష్మాన్ ఆరోగ్యం మందిర్లో పనిచేసే పల్లె దవకాన వైద్యాధికారులను నియమించామని వివరించారు.