calender_icon.png 3 August, 2025 | 3:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహాలక్ష్మి పథకంలో మహిళలకు 655.19 లక్షల ప్రయోజనం

02-08-2025 01:02:24 AM

జయశంకర్ భూపాలపల్లి (మహబూబాబాద్) ఆగస్టు 1 (విజయ క్రాంతి): మహాలక్ష్మి పథకంలో  జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 2025 జూలై చివరి నాటికి 500 రూపాయల సబ్సిడీతో 2,36,243 సిలిండర్లను  మహిళలకు అందజేసినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ శుక్రవారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ లను అందించడం ద్వారా 655.19 లక్షల రూపాయల ప్రయోజనం చేకూరిందని చెప్పారు.

జిల్లాలోని 11మండలాలు , భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో 68,084 పేద, మధ్యతరగతి కుటుంబాలకు మహాలక్ష్మి పథకం ద్వారా లబ్ధి చేకూరిందని కలెక్టర్ చెప్పారు. రేగొండ మండలంలో అత్యధికంగా 12,292 కుటుంబాలకు ఇప్పటి వరకు  41,459 సిలిండర్లు పంపిణీ చేయడం ద్వారా రూ.121.36 లక్షల సబ్సిడీ అందిందని తెలిపారు.

ఇదే విధంగా భూపాలపల్లి మండలంలో 6,487 మంది లబ్ధిదారులకు 23,696 సిలెండర్లు ఇవ్వడం ద్వారా 65.19 లక్షలు, మహా ముత్తారం మండలంలో 3,988 మంది లబ్ధిదారులకు 12,193 సిలెండర్లు అందించడం ద్వారా 18.57.లక్షలు, మల్హార్ రావు మండలంలో 5,340 మంది లబ్దిదారులకు 20,628 సిలెండర్లు ఇవ్వడం ద్వారా 58.70 లక్షలు, ఘనపూర్ మండలంలో 5,798 మంది లబ్ది దారులకు 20,822 మంది సిలెండర్లు ఇవ్వడం ద్వారా 64.26 లక్షలు,

టేకుమట్ల మండలంలో 4,286 మంది లబ్ధిదారులకు 13,574 మంది లబ్దిదారులకు 40.69 లక్షలు, మొగుళ్లపల్లి మండలంలో 5,981 మంది లబ్ధిదారులకు19,112 సిలిండర్ల  ద్వారా 59.08 లక్షలు, కాటారం మండలాల్లో 6,550 మంది లబ్ధిదారులకు 21,619 సిలెండర్లు సరఫరా చేయడం ద్వారా 52.59 లక్షలు, మహాదేవపూర్ మండలంలో 5,063 మంది లబ్ధిదారులకు 18,008 సిలెండర్లు సరఫరా చేయడం ద్వారా 47.48 లక్షలు,

పలిమెల మండలంలో 898 మంది లబ్దిదారులకు 1,650 సిలెండర్లు 2.28 లక్షలు, చిట్యాల మండలంలో 6,111 మంది కుటుంబాలకు 19,557 సిలెండర్లు ఇవ్వడం ద్వారా 57.12 లక్షలు, భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో 5,290 కుటుంబాలకు 23,925 సిలెండర్లు ఇవ్వడం ద్వారా 67.87.లక్షలు మొత్తం 655.19 లక్షలు 500 లకే సబ్సిడీపై గ్యాస్ సిలిండర్లు అందించినట్లు కలెక్టర్ వివరించారు.

వంటకు గ్యాస్ సదుపాయం వల్ల ఆరోగ్య పరిరక్షణతో పాటు సమయాన్ని కూడా ఆదా చేసుకోగలుగుతున్నారని, ఈ పథకంతో ఊరూరా పేద మహిళల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తోందన్నారు. ప్రతి మండలంలో లబ్ధిదారులకు సకాలంలో సేవలు అందించేందుకు అధికార యంత్రాంగం నిబద్ధతతో పని చేస్తోందన్నారు. ప్రజా పాలన పథకం ద్వారా ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చే దిశగా ప్రభుత్వం చేస్తున్న కృషికి గొప్ప పథకంగా  ఈ పథకం ఆదర్శంగా  నిలిచిందన్నారు.