calender_icon.png 3 August, 2025 | 12:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తమ పోరాట ఫలితమే ఐదు శాతం పీఎల్ఎఫ్ అలవెన్స్

03-08-2025 09:04:42 AM

1535 సంఘం రాష్ట్ర అధ్యక్షులు వజీర్..

మణుగూరు (విజయక్రాంతి): పిఎల్ఎఫ్ అలవెన్స్ కోసం తమ సంఘం ఫలు మార్లు విజ్ఞప్తులు చేసిన ఫలితంగానే యాజమాన్యం పిఎల్ఎఫ్ అలవెన్స్ అంగీకరించిందని 15 35 సంఘం రాష్ట్ర అధ్యక్షులు వజీర్(State President Wazir) తెలిపారు. జెన్కో యాజమాన్యం కేటీపీఎస్ ఏడోదశ, భద్రాది ధర్మల్ పవర్ స్టేషన్ల లో పనిచేస్తున్న ఉద్యోగులకు 5 శాతం పీఎల్ఎఫ్(ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్) అలవెన్స్ మంజూరు చేస్తూ జీవో జారీ చేయడంపై తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ యూనియన్(Telangana State Power Employees Union) -1535 రాష్ట్ర అధ్యక్షులు ఎంఏ. వజీర్ హర్ష వ్యక్తం చేశారు. ఈ మేరకు మణుగూరులో ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు.

పిఎల్ఎఫ్ అలవెన్స్ మంజూరు చేసినందుకు జెన్కో సీఎం డి హరీష్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ జీవో లోని అంశాలను ప్రస్తావిస్తూ ప్రతి నెల 85 శాతం ప్లాంట్ లోడ్ ఫ్యాక్టరీ ఉన్న కర్మగారాలకు ఈ అలవెన్స్ వర్తిస్తుందని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నెల ఏప్రిల్ నుంచి ఈ అలవెన్స్ ఉద్యోగులకు వర్తిస్తుందన్నారు. అలవెన్స్ లకు సంబంధించిన ఏరియర్స్ కూడా అందజేస్తారన్నారు. జనరేటింగ్ అలివేన్స్ ఇవ్వాలని పలుమార్లు యాజమాన్యానికి దృష్టికి తమ సంఘం తీసుకొని వెళ్ళామని  దాని ఫలితం గానే యాజమాన్య స్పందించి పీఎల్ఎఫ్  అలవెన్స్ జీవో జారీ చేసిందని పేర్కొన్నారు. పత్రికా ప్రకటన విడుదల చేసిన వారిలో యూనియన్ రీజినల్ అధ్యక్షులు వి.ప్రసాద్ ప్రధాన కార్యదర్శి ఆర్. రామచందర్,రాష్ట్ర కమిటీ సభ్యులు ఏ.వెంకటేశ్వర్లు, సిద్దులహుస్సేన్,జార్జ్, కోశాధికారి శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్లు ఎస్ డి రఫీ,రాజా మనోహర్, అనిల్ తదితరులు ఉన్నారు.