01-01-2026 01:42:32 AM
అచ్చంపేట, డిసెంబర్ 31(విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని మల్లమ్మ కుంటలో బొడ్డు తాడు కూడా కోయని శిశువును గుర్తుతెలియని వ్యక్తులు పడేసి వెళ్లిపోయినట్లు ఎస్‌ఐ కె.సద్దాం తెలిపారు. శిశువు మృతదేహం నీటిలో తేలుతుండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మున్సిపల్ సిబ్బంది సహాయంతో పసికందు మృతదేహాన్ని నీటిలో నుంచి బయటకు తీసి, పోస్టుమార్టం నిమిత్తం అచ్చంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చెప్పారు. దారుణానికి పాల్పడింది ఎవరు.. ఆ పసికందును అక్కడికి ఎవరు తీసుకువచ్చారనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలిపారు.