01-01-2026 01:39:51 AM
వచ్చే సంవత్సరం నుంచి అమలు
హైదరాబాద్, డిసెంబర్ 31 (విజయక్రాంతి): డీఎడ్, బీఎడ్ కోర్సుల సిలబస్‌లో మార్పులు చేయనున్నారు. వచ్చే సంవత్సరం నుంచి దీన్ని అమలు చేయనున్నారు. ప్రస్తుతమున్న సిలబస్‌లోని కొన్ని అంశాలను మార్చి కొత్త అంశాలను చేర్చనున్నట్లు తెలిసింది. ఈ రెండు కోర్సులు చేసిన వారు డీఎస్సీకు అర్హులు కావడంతో పాత సిలబస్‌ను తీసేసి కొత్త అంశాలను చేర్చనున్నట్లు తెలిసింది.