26 April, 2026 | 3:22 AM

స్మశానంలో పసిబిడ్డ లభ్యం

26-04-2026 01:42 AM

వదిలేసి వెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు

అశ్వాపురం, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం గుట్ట మల్లారం గ్రామపంచాయతీ పరిధిలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఆరు నెలల పసిబిడ్డను స్మశాన వాటికలో వదిలివెళ్లడం స్థానికులను కంటతడి పెట్టించింది.స్మశానంలో పసిబిడ్డ వివరాల్లోకి వెళితే, గుట్ట మల్లారం వైకుంఠధామం స్మశాన వాటికలోని బాత్రూంలో గుర్తుతెలియని వ్యక్తులు పసిబిడ్డను వదిలివేసి వెళ్లినట్లు తెలుస్తోంది.

శనివారం ఉదయం గమనించిన స్థానికులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై స్పందించిన బాలల పరిరక్షణ అధికారులు, పిల్లలను ఇలా వదిలివేయడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు.ఎవరైనా పిల్లలను చూసుకోలేని పరిస్థితి ఉంటే అధికారులకు సమాచారం ఇవ్వాలని, వివరాలను గోప్యంగా ఉంచి చట్టబద్ధంగా దత్తత ప్రక్రియ ద్వారా అవసరమైన వారికి అందించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.