26 April, 2026 | 3:08 AM

ఉద్యోగ మిత్రకు అనూహ్య స్పందన

26-04-2026 01:40 AM

2,000 మందికిపైగా అభ్యర్థులు హాజరు

624 మందికి నియామక పత్రాలు అందజేత

సిద్దిపేట క్రైం, ఏప్రిల్ 25: యువత భవిష్యత్తుకు బలమైన పునాది వేయడమే ‘ఉద్యోగ మిత్ర’ లక్ష్యమని పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ చెప్పారు. సిద్దిపేట జిల్లా యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడమే లక్ష్యంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ’సిద్దిపేట పోలీస్ ఉద్యోగ మిత్ర  మెగా జాబ్ మేళా 2026 కు అనూహ్య స్పందన లభించింది.

శనివారం స్థానిక పోలీస్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి యువత పెద్ద సంఖ్య లో తరలివచ్చింది.ఈ మెగా జాబ్ మేళా లో సుమారు 65 ప్రముఖ కంపెనీలు పాల్గొని వివిధ రంగాల్లో ఖాళీలకు అభ్యర్థులను ఎంపిక చేశాయి. ఐటీ, ఫార్మా, టెక్నికల్, స్కిల్ వర్క్, సేల్స్ అండ్ సర్వీసెస్ వంటి విభాగాల్లో ఉద్యోగావకాశాలు అం దుబాటులో ఉండగా, 2,000 మందికి పైగా అభ్యర్థులు హాజరై తమ ప్రతిభను చాటుకున్నారు.

ఇంటర్వ్యూల అనంతరం 624 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, సిద్దిపేట పోలీసు యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్ర మంలో అదనపు డీసీపీ (అడ్మిన్) కుశాల్కర్, అదనపు డీసీపీ (ఏఆర్) సుభాష్ చం ద్రబోస్, ట్రైనీ ఐపీఎస్ ఆయేషా ఫాతిమా, ఏసీపీలు, ఇన్‌స్పె క్టర్లు, పోలీసు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.