సంక్షేమ హాస్టల్లో మౌలిక వసతులు
09-04-2026 12:00 AM
నిర్మల్, ఏప్రిల్ 8 (విజయక్రాంతి): సాంఘిక సంక్షేమ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సంక్షేమ హాస్టల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని అడిషనల్ డైరెక్టర్ సి శ్రీధర్ అన్నారు. బుధవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎస్సీ సంక్షేమ హాస్టల్ ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని. తాగునీటి సౌకర్యం కల్పించాలని. మరుగుదొడ్లు మూత్రశాలను తప్పనిసరిగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారి దయానంద్, సాయ అధికారి లత, అధికారులు మాణిక్ రావు శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.




