12-08-2025 12:00:00 AM
నాగర్ కర్నూల్, ఆగస్టు 11 (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా ఏర్పడి దశాబ్దం గడుస్తున్నా, కొన్ని శాఖల్లో ఉద్యోగులు బదిలీ కాకుండా ఇక్కడే పాతుకుపోయి పనిచేస్తున్నారని ఫలితంగా ప్రజలకు సేవ చేయకుండా అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని అలాంటివారిని వెంటనే బదిలీ చేయాలని డిమాండ్ చేస్తూ బీఎస్పీ నేతలు సోమవారం జిల్లా అదనపు కలెక్టర్ దేవసాయం కు వినతి పత్రాన్ని అందించారు.
గురుకులాల్లో పుడ్ పాయిజన్ ఘటనలపై సమీక్ష జరిపి చర్యలు తీసుకోవాలని, టెండర్ నిబంధనలు సడలించాలని డిమాండ్ చేశారు. పాత కలెక్టర్ క్యాంపు కార్యాలయాన్ని అతిథి గృహంగా మార్చాలన్నారు. అనధికారికంగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను బదిలీ చేయకపోతే ఆఫీసుల ముట్టడి తప్పదని హెచ్చరించారు. వినతి పత్రం అందించిన వారిలో బీఎస్పీ నేతలు పృధ్విరాజ్, కళ్యాణ్ తదితరులు ఉన్నారు.