ఆదిలాబాద్‌లో నీటి ఎద్దడిపై ఆరా

20-04-2024 01:47:01 AM

జిల్లాలో పర్యటించిన రాష్ట్ర స్పెషల్ సెక్రటరీ ప్రశాంత్ జీవన్‌పాటిల్ 

ఆదిలాబాద్,  ఏప్రిల్ 19 (విజయ క్రాంతి): వేసవి దృష్ట్యా ఆదిలాబాద్ జిల్లాలో నెలకొన్న నీటి సమస్యపై ఆరా తీసేందుకు రాష్ట్ర స్థాయి అధికారుల బృందం పర్యటిస్తున్నది. ఇందులో భాగంగానే  జిల్లా ప్రత్యేక అధికారి, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్ శుక్రవారం ఆదిలాబాద్ జిల్లాలోని డోంగర్గావ్, తోషం తండా, పులిమడుగు, కుమ్మరి తండా గ్రామాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన గ్రా మ ప్రజలను తాగునీటి సరఫరా గురించి అడిగి తెలుసుకొన్నారు. కొన్ని గ్రామాల్లో అ పోహలతో ప్రజలు మిషన్ భగీరథ నీటిని తాగడం లేదని తన దృష్టికి వచ్చిందని,  ఆ నీటిని అందరూ తాగునీటి అవసరాలకు ఉపయోగించుకోవాలని సూచించారు. మి షన్ భగీరథ నీరు ప్రతిరోజు సరఫరా కాని గ్రామాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సత్వరమే చేపట్టాలని అధికారులను ఆదేశిం చారు. గ్రామ పంచాయతీ బోర్ల ద్వారా నీటి సరఫరా అవుతున్న గ్రామాల్లో మే రెండో వారం వరకు అడుగంటి పోయే బోర్లను గుర్తించి తదనుగుణంగా వ్యవసాయ బోర్ల ను అద్దెకు తీసుకోవాలని సూచించారు.  గ్రా మ పంచాయతీ ట్యాంకర్లు అవసరమైతే ప్రైవేటు ట్యాంకర్ల ద్వారానైనా తాగునీటి సరఫరా చేపట్టి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ వికాస్‌మహతో,  మిషన్ భగీరథ ఎస్‌ఈ సురేష్, ఈ ఈ చంద్రమోహన్, నీటిపారుదల ఎస్‌ఈ ఈ విట్టల్, డిఎల్‌పివోలు ఫనీందర్, ప్రభాకర్, ఎంపీడీవోలు, ఎంపీవో లు, ఏఈలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.